Breaking News

మనపై మనకు నమ్మకం ఉంటే లక్ష్యాలు సాధించగలం

-విద్యార్థి జెస్సికా ను స్ఫూర్తిగా తీసుకోవాలి
-రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు
-కలెక్టర్ డా కె. మాధవీలత
-ఎమ్మెల్యే తలారి వెంకట్రావు

గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు ఆంగ్ల మాధ్యమంలో బోధన పద్ధతులను ప్రవేశ పెట్టడం జరిగిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.

శుక్రవారం గోపాలపురం డా బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ శాసన సభ్యులు తలారి వెంకట్రావు తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా బాలికలతో ముఖాముఖి సంభాషించారు. అనంతరం కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడి ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యాంశాలను భోధన చెయ్యడం జరుగుతోందని అన్నారు. నాడు నేడు ద్వారా స్కూల్స్ రూపురేఖలు మార్చి అన్ని వసతులు కల్పించడం జరిగిందన్నారు. అదే విధంగా ఉచితంగా పుస్తకాలు, బ్యాగ్ ఇవ్వటం, అమ్మ ఒడి కింద ఆర్థిక సహాయం చేయడం, మధ్యాహ్న భోజన పథకం కింద పౌష్టి కాహరం అందించడం, స్కూల్ యూనిఫాం, షూస్ తదితరాలు అందచేసినట్లు పేర్కొన్నారు. ఇంత చక్కటి వాతావరణం ప్రభుత్వ స్కూల్స్ లో సమాకుర్చితే మీరు ఏమి చెయ్యాలని విద్యార్థులను ప్రశ్నించగా… విద్యార్థులు సమాధానమిస్తూ… చక్కగా చదువుకుని జగనన్న ఆశించిన మంచి స్థాయి లో ఉంటామని తెలిపారు.

‘ విద్యార్ధి జెస్సికా” భేష్.. కలెక్టర్ అభినందన:
మీలో ఎంతమంది ఇంజినీర్లు అవుతారని కలెక్టర్ మాధవీలత ప్రశ్నించారు. విద్యార్థినులు ఉత్సాహంగా చేతులు ఎత్తి తమ అభిష్టాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జెస్సికా అనే బాలిక తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూల్స్, వసతి గృహాల్లో చదువుతున్న పిల్లలకు నాణ్యమైన భోధన అందిస్తున్నామని, జెస్సికా ఆంగ్లం లో అనర్గళంగా మాట్లాడుతూ మనందరికి స్ఫూర్తిగా నిలిచిందని, మిగిలిన పిల్లలు కూడా జెసికాని రోల్ మోడల్ గా తీసుకోవాలని సూచించారు. ప్రవేటు స్కూల్స్ పిల్లలు కూడా ఇతర ఇతర భాషలలో ఇంత అనర్గళంగా విశ్వాసంతో ఉండడం నేను చూడలేదని పేర్కొన్నారు. జెస్సికా తన లక్ష్యాలను సాధించే క్రమంలో తప్పక విజయం సాధించ గలుగుతుంది అని మాధవీలత ఈ సందర్భంలో పేర్కొనడం గమనార్హం.

విద్యార్థి జెస్సికా మాటల్లో:
మా ఉపాధ్యాయులు నిరంతరం భాష పై, వివిధ పాఠ్యాంశాలు పై పట్టు పెంచుకునేలా, నైపుణ్యాభివృద్ది పెంచుకునేందుకు శిక్షణ ఇవ్వడం జరుగుతోందని జెస్సికా వివరించారు. ఈ సందర్భం గా జగనన్న మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానీయం అని మీకు మాట ఇస్తున్నా అంటూ కలెక్టర్ మాధవీలత తో జెస్సికా తెలిపారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయరాలును, ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు.

కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు తలారి వెంకట్రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *