Breaking News

ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభం

-వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం ఆవరణలో ఇస్రో రాకెట్స్ నమూనాల ప్రదర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులు ప్రతి రంగంలో అసలైన లీడర్లుగా ఎదగాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం  వైస్ ఛాన్సలర్ ఆచార్య కె పద్మరాజు పేర్కొన్నారు. స్థానిక శ్రీవెంకటేశ్వర ఆనం కళాకేంద్రం ఆవరణలో ఇస్రో ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీ వరకు నిర్వహించనున్న   ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ఇస్రో ఆధ్వర్యాన  శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా వి సి ఆచార్య కె పద్మరాజు మాట్లాడుతూ డా అబ్దుల్ కలాం చేత మొట్టమొదటి రాకెట్ ప్రయోగం చేయించిన  సతీష్ ధావన్, అది విఫలం కావడంతో దాని బాధ్యత తనపై వేసుకున్నారన్నారు. ఆతర్వాత మరో రాకెట్ ప్రయోగం చేయించి విజయం సాధించడంతో ఆ ఘనత  డా. కలాం మనందరికీ ఇచ్చారన్నారు. వైఫల్యాన్ని తాను తీసుకుని, విజయాన్ని ఇతరులకు ఇవ్వడం అసలైన లీడర్ గొప్పతనమని  ఆయన విశ్లేషించారు. ఇస్రో ప్రయోగాల వలన భారత కీర్తి పతాక రెపరెపలాడుతోందన్నారు. తాజాగా చంద్రయాన్ విజయవంతంతో ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోదన్నారు. తాను ఇంజనీరింగ్ విద్యార్థులకు బోధన చేసినపుడు తరచూ సబ్జెక్టులు మారడం వలన  అడ్వాన్స్  శాటిలైట్ సబ్జెక్ట్ కూడా బోధించానని ఆయనగుర్తుచేసుకున్నారు. విద్యావిధానంలో కూడా అనూహ్య మార్పులు వస్తున్నాయని ఆయన చెబుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందిం చాలన్నారు. ఇస్రో రూపొందించిన బ్రోచర్  ని విసి పద్మరాజు  ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా మున్సిపల్ కార్పొరేషన్, ప్రైవేట్ కాలేజెస్  అసోసియేషన్, ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్  అసోసియేషన్, ది రాజమండ్రి ప్రెస్ క్లబ్  సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న  ఇస్రో కార్యకలాపాల వివరాలు,  రాకెట్స్ నమూనాల ప్రదర్శనను  ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కె. పద్మరాజు ప్రారంభించారు.

అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలి : కమిషనర్ దినేష్ కుమార్
అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ కె దినేష్ కుమార్ సూచించారు. తాము చదుకునే సమయంలో  ఇలాంటి అవకాశాలు లేవని, ఇలాంటి విషయాలు పెద్దగా తెలియవని అన్నారు. ఇప్పుడు సౌకర్యాలు, అవకాశాలు మన ముందుకు వస్తున్నందున వినియోగించుకోవాలని ఆయన అన్నారు. రోజుకి పదివేలమంది విద్యార్థులు సందర్శించేలా ప్రణాళిక వేసినట్లు తెలిపారు. చంద్రయాన్ విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. ఇస్రో రూపొందించిన పోస్టర్ ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం అతిధులను ఇస్రో పక్షాన  సత్కరించారు.

శ్రీహరికోట ఎస్.డి.ఎస్.సి.డిప్యూటీ డైరెకర్ టి ఎస్.రఘురామ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అంతరిక్ష పర్యాటకం రాబోతోందని, అందుకు అనుగుణంగా ఇస్రో పరిశోధనలు, ప్రయోగాలు సాగిస్తోందని పేర్కొన్నారు. అంతరిక్షానికి అవధి లేదని, ఈ విశ్వం అనంతమని, అపారమని, ఎవరికీ చెందని సంపద ఉందని అన్నారు.
ఆత్మ నిర్బర్ భారత్, స్వాతంత్య్ర అమృతోత్సవం నేపథ్యంలో అంతరిక్ష విజ్ఞానాన్ని ఇంటింటికి తీసుకెళ్లే ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. 2016నుంచి అంతరిక్ష వారోత్సవాలను వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నా మని జిల్లాస్థాయి, తాలూకా స్థాయిల్లో కూడా నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ఏడాది ‘స్పేస్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ షిప్’ పేరుతొ అంతరిక్ష వారోత్సవాలు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో 9బిలియన్ డాలర్ల వ్యాపారం సాగుతుండగా 2047నాటికి 70రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు.

శ్రీహరికోట షార్ ఎల్ఎస్ఎస్ఎఫ్ జనరల్ మేనేజర్ ఎన్. విజయకుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రితో పాటు విశాఖ, కర్నూల్, శ్రీహరి కోట లలో వారోత్సవాలు చేస్తున్నామని, మిగిలిన చోట్ల అన్ని సౌకర్యాలున్న ఇంజనీరింగ్ కాలేజీలలో చేస్తుంటే రాజమండ్రిలో మాత్రం ప్రజల మధ్య చేస్తున్నట్లు చెప్పారు. నిన్నటి రోజున నిర్వహించిన స్పేస్ వాక్ కి మంచి స్పందన లభించి 3,500మంది విద్యార్థులు పాల్గొనడం ఒక రికార్డు అని పేర్కొన్నారు.

తొలుత ఫ్యూచర్ కిడ్స్ విద్యార్థులు నమో భారతావని, వేదంలా ఘోషించే గోదావరి నృత్య ప్రదర్శనలు అలరించాయి. ట్రిప్స్,   తదితర స్కూల్స్ విద్యార్థులు తయారు చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ  అంశాలను కూడా ఇందులో ఉంచారు. రాజ్యలక్ష్మి మహిళా కళాశాల ఎన్ సిసి కేడెట్స్, పీఈటీలు సేవలందిస్తున్నారు. పలు స్కూల్స్  విద్యార్థులు ప్రదర్శన తిలకిస్తున్నారు.

కార్యక్రమంలో శ్రీహరికోట ఎస్.డి.ఎస్.సి.డిప్యూటీ డైరెకర్ టి ఎస్.రఘురామ్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కె  దినేష్ కుమార్, శ్రీహరికోట షార్ ఎల్ఎస్ఎస్ఎఫ్ జనరల్ మేనేజర్ ఎన్. విజయకుమార్, ఎస్ డి ఎస్ సి హెడ్ బడ్జెట్ లీలా నాగ శ్రీనివాస్,  రాజమహేంద్రి మహిళా కళాశాల చైర్మన్  టి. కె. విశ్వేశ్వర రెడ్డి, పలువురు ఇస్రో  శాస్త్రవేత్తలు, సిబ్బంది, ఉప విద్యాశాఖాధికారి నారాయణ,  ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి,   ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత బాలాత్రిపుర సుందరి, అక్షర శ్రీ స్కూల్ డైరెక్టర్ టి నాగరత్నం, ప్రయివేట్ స్కూల్స్ మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ నాయకులు భాస్కర రామయ్య,  పురెడ్ల కళ్యాణ్ రెడ్డి, రవిచంద్ర, ఏ రమేష్, పి. సురేష్, ప్రగతి మురళి, ప్రసాద్ స్కూల్ ప్రసాద్,  జస్వర్ స్కూల్ రమేష్,  పి గంగాధరరావు, డివి స్వామిరెడ్డి,  ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు మండెల శ్రీరామ్మూర్తి, అధ్యక్షులు కె పార్ధసారధి, తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శనను ఆద్యంతం తిలకించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *