విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎం జె నాయుడు హాస్పిటల్ 37 వార్షికోత్స వాన్ని పురస్కరించుకుని శుక్రవారం నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థిని విద్యార్థులకు వైల్డ్ ఒబిసిడి పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంస్థ అధినేత ఎంజె నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినీ విద్యార్థులకు ఇటువంటి పోటీలను నిర్వహించి నగదు బహుమతులు ఇవ్వడం ముదవాహమన్నారు. హాస్పిటల్ గౌరవ చైర్మన్ వావిలాల రజనీకాంత్ శర్మ మాట్లాడుతూ డ్రాయింగ్, ఎలక్యూషన్, పోస్టర్ ప్రజెంటేషన్ లలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ఎనిమిదో తేదీ వార్షికోత్సవ వేదికపై ముఖ్య అతిథుల చేతుల మీదుగా నగదు బహుమతులను అందిస్తామన్నారు. హెల్త్ అవేర్నెస్ క్యాంప్ లో భాగంగా డాక్టర్ వంశీ, డాక్టర్ రవితేజలు ఊబకాయులకు పలు సూచనలు చేసి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎండి డి. మాధవినాయుడు, హాస్పిటల్స్ సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News