తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 16 నుండి ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెక్ (ఎఫ్.ఎల్.సి) కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ ఎస్ ఎస్ ఆర్ 2024 పై సమావేశమయ్యారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎంల పనితీరుకు సంబంధించి ఎఫ్.ఎల్.సి అన్నది ఓటింగ్ యంత్రాల అనుసంధానం చాలా ముఖ్యమైన అంశం రాజకీయ పార్టీల భాగస్వామ్యం ఎంతో కీలకం. కాబట్టి ఆయా పార్టీల ప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొన్నాల్సి ఉందన్నారు. (ACCEPTENCE TEST PROCESS ) ఎ టి పి అనుసందా ప్రక్రియ జరుగుతున్న విషయం మీకు తెలుసు అన్నారు. ఈ నెల 16 నుండి రేణిగుంట వేర్ హౌసింగ్ కాంపౌడ్ నందు గల ఈ వి ఎం గొడౌన్లో ఓటింగ్ యంత్రా ల అనుసంధానం అంటే కంట్రోల్ యూనిట్ , బ్యాలెట్ యూనిట్ , వి వి పాట్ అనుసంధానం చేపట్టి ఓటింగ్ బటన్ల పరిశీలన, ప్రింట్ స్లీప్ ల పరిశీలన చేయాలని అన్నారు. జిల్లాకు ఇప్పటివరకు బ్యాలెట్ యూనిట్లు 6780, కంట్రోల్ యూనిట్లు 4270, వివి పాట్ లు 6450 అంది స్కానింగ్ చేపట్టామని తెలిపారు. డిఫెక్టివ్ ఈవీఎంల వివరాలు కూడా రాజకీయ పార్టీలకు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈవీఎంల ఎఫ్ఎల్ సి తర్వాత రాండమైజేషన్ చేస్తామని, వాటి భద్రత అంశంలో ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల మేరకు రాజకీయ పార్టీల సమక్షంలో సీల్ వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమీక్షలో రాజకీయ పార్టీల ప్రతినిధులు , ఈ ఆర్ ఓ లు , అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News