Breaking News

నేత్ర సమస్యలపై నిర్లక్ష్యం తగదు


– జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు
– వరల్డ్ సైట్ డే సందర్భంగా సంధ్య కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో వాకథాన్
– దివంగత డాక్టర్ ఎం.ఎన్. రాజు ఆశయ సాధనకు కృషి చేస్తాం
– సంధ్య కంటి ఆసుపత్రి సీఈవో మునగపాటి భార్గవ్‌రామ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మనిషి జీవితంలో ప్రతీది దృష్టితో ముడిపడి ఉందని, అందుకే కళ్లను నిర్లక్ష్యం చేయరాదని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు‌ అన్నారు. సంధ్య కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో వరల్డ్‌ సైట్‌ డే సందర్భంగా సూర్యారావుపేటలో గురువారం నిర్వహించిన వాకథాన్ ను ఆయన ప్రారంభించారు. ‘లవ్ యువర్ ఐస్ ఎట్ వర్క్’ అనే నినాదంతో సాగిన ర్యాలీని జిల్లా కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడుతూ, కంటి ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసి, నేత్ర సంబంధ సమస్యల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు సంధ్య కంటి ఆసుపత్రి నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. స్మార్ట్‌ ఫోన్లు, కంప్యూటర్లను అధికంగా వినియోగించడం వల్ల దృష్టి లోపాలు తలెత్తే ప్రమాదం ఉందని, స్మార్ట్‌ ఫోన్లు చూడకుండా, వీడియో గేమ్స్‌ ఆడకుండా ఉండేలా జాగ్రత్త వహించాలని చెప్పారు. నేత్ర సమస్యలు తలెత్తిన వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రి సీఈవో మునగపాటి భార్గవ్‌రామ్‌ మాట్లాడుతూ, ప్రజలందరికీ నేత్ర వైద్య సేవలను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో సంధ్య కంటి ఆసుపత్రి నెలకొల్పిన డాక్టర్‌ ఎం.ఎన్‌.రాజు ఆశయ సాధనకు కృషి చేస్తామని వెల్లడించారు. సంధ్య కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో అనేక ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించామని, నేత్ర సంరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పలు కార్యక్రమాలను చేపట్టామని అన్నారు. కంటి చూపు, నేత్ర సంరక్షణ విషయంలో ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. ‘లవ్ యువర్ ఐస్ ఎట్ వర్క్’ అనే నినాదంతో ఈ ఏడాది వరల్డ్‌ సైట్‌ డే జరుపుకుంటున్నామని తెలిపారు. పనిచేసే ప్రదేశాల్లో నేత్ర సంరక్షణపై అవగాహన కల్పించడం, కార్మికులు, ఉద్యోగుల కోసం నేత్ర సంరక్షణ చర్యలు చేపట్టేలా వ్యాపారాధినేతలను ప్రోత్సహించడం తదితర కార్యక్రమాలను వరల్డ్ సైట్ డే సందర్భంగా నిర్వహిస్తారని వివరించారు. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా తమ ఆసుపత్రి ద్వారా వయోవృద్ధులకు ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వరల్డ్ సైట్ డీ వాకథాన్ లో సిద్ధార్థ ఫార్మసీ కళాశాల విద్యార్థులు, పలు ఫార్మసీ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *