-రూ.15.74 లక్షలతో నిర్మించిన జగనన్న పాల వెల్లువ శీతలీకరణ కేంద్రాన్ని(బియంసీయు) భవనాన్ని ప్రారంభించిన ..
-మంత్రి తానేటి వనిత, కలెక్టరు మాధవీలత
కొవ్వూరు(కాపవరం), నేటి పత్రిక ప్రజావార్త :
సహకార డెయిరీ రంగాన్ని బలో పేతం చేసేందుకు జగనన్న పాలవెల్లువ ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు.
గురువారం కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన వైఎస్సార్ జగనన్న కాలనీలో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు “గృహోత్సవాలు”ల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేసి హోంమంత్రి డా.తానేటి వనిత, జిల్లా కలెక్టరు డా. మాధవీలత, జేసీ తేజ్ భరత్ లతో కలసి నూతనంగా రూ.15.74 లక్షల రూపాయలతో నిర్మించిన జగనన్న పాల వెల్లువ శీతలీకరణ కేంద్రాన్ని(బియంసీయు) భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ మహిళ పాడి రైతుల ప్రయోజనం కోసం చేపట్టిన సహకార డెయిరీ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జగనన్న పాలవెల్లువ వలన మహిళ పాడి రైతులకు మేలు జరుగుతుందన్నారు. గ్రామాల్లో పాడి రైతులకు మేలు చేసే సహకార సంస్థ తిరిగి బలోపేతం చేసేందుకు జగనన్న పాలవెల్లువ దోహదపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం కింద 18 నుంచి 45 ఏళ్ళ వయస్సు కలిగిన మహిళలకు ఏటా రూ.18750 చొప్పున గత నాలుగేళ్లలో రూ.75 వేలు నేరుగా నగదు బదలీ పధకం కింద వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. ఆ మొత్తం పశు సంపద అభివృద్ధి కోసం సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేడు నూతనంగా రూ.15.74 లక్షల రూపాయలతో నూతనంగా జగనన్న పాల వెల్లువ శీతలీకరణ కేంద్రాన్ని(బియంసీయు) భవనాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.
జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత మాట్లాడుతూ జిల్లాలోని ప్రతీ గ్రామం లో పాల సేకరణ కోసం మహిళా సహకార సంఘాలు ఏర్పాటు చేసామని అన్నారు. జిల్లాలో పశు సంపద ద్వారా జీవనోపాధి పై ఆధారపడిన కుటుంబ నేపథ్యం ఉన్న వారు ఉన్నారన్నారు. జగనన్న పాల వెల్లువ ద్వారా పశు సంపద కలిగిన కుటుంబాలను ప్రోత్సహించడం జరుగు తున్నట్లు పేర్కొన్నారు. జగనన్న పాల వెల్లువ ద్వారా పాల సేకరణ చేపడుతున్న అమూల్ కేంద్రాలకు పాలను అందచేసి ఆర్థికంగా బలోపేతం కావాలని పిలుపు నిచ్చారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్, ఆర్డీవో ఎస్. మల్లిబాబు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, జెడ్పీ వైస్ చైర్ పర్సన్ పోసిన శ్రీలేఖ,మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గండ్రోతు అంజలీ దేవి, డ్వా పీడీ పి. జగదాంబ, డీఎల్డీవో వి. శాంతామణి, పశు సంవర్థకశాఖ ఉప సంచాలకులు, స్థానిక నాయుకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News