Breaking News

రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను పారదర్శకంగా కొనుగోలు చేస్తాం..

-రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు అందింస్తాం.
-కాపవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ..
-హోం మంత్రి డా. తానేటి వనిత
-కలెక్టర్ డా కే. మాధవీలత

కొవ్వూరు(కాపవరం), నేటి పత్రిక ప్రజావార్త :
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను అందించడంతో పాటు చివరి బస్తా వరకు ధాన్యాన్ని ప్రభుత్వం పారదర్శకంగా జవాబుదారీ తనంతో కొనుగోలు చేస్తుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు.

గురువారం కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన వైఎస్సార్ జగనన్న కాలనీలో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు “గృహోత్సవాలు”ల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేసి హోంమంత్రి డా.తానేటి వనిత, జిల్లా కలెక్టరు డా. మాధవీలత, జేసీ తేజ్ భరత్ లతో కలసి స్థానికంగా ఉన్న రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు సంక్షేమమే లక్ష్యంగా విత్తు నుంచి విక్రయం వరకు రైతుకు అండగా ఉంటూ ఆర్థిక భరోసాను అందిస్తున్నారన్నారు. వ్యవసాయాన్ని పండుగలా చేసి చూపించారు.. మన ప్రియతమ నేత జగనన్న అని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతు పండించిన ధాన్యానికి దళారీల ప్రమేయం లేకుండా పార దర్శకంగా జవాబుదారీ తనంతో మద్దతు ధరను అందించడం జరుగుతుందన్నారు.

జిల్లా కలెక్టర్ డా. కె మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో ఆర్బీకేల్లో 231 ధాన్యం కొను గోలు కేoద్రాలు ఏర్పాటు చేసామన్నారు. ఈ ఏడాది 4.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించామన్నారు. రైతులు తమ సమస్యలను ఫిర్యాదుల రూపంలో ఉన్నతాధికారులకు చెప్పేందుకు వీలుగా జిల్లా, డివిజన్, మండల స్థాయి కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ల అందుబాటులో ఉంచామన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు గత ఏడాది కంటే 10 రోజుల ముందుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. ధాన్యం తేమ శాతాన్ని తెలియజేసే మాయుశ్చర్ మిషన్ ప్రతి తాహశీల్థారు కేంద్రంలో ఉంచడం జరిగిందని, ఏ మిల్లులోనైనా సమస్య ఎదురైతే దగ్గరలోనే ఉన్న తాహశీల్థారు కార్యాలయంలో తేమ శాతం తెలియజేస్తుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతు పండించిన ధాన్యానికి ప్రభుత్వం కల్పించిన పూర్తి స్థాయిలో మద్దతు ధరను అందిస్తా మన్నారు. కస్టమైజ్డ్ మిల్లర్లు సరఫరా చేసే గన్ని బ్యాగులకు అనుగుణంగా లక్ష్యాలను ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రైతునుంచి ధాన్యం కొనుగోలు విధానాన్ని ఆన్లైన్ ద్వారా లావాదేవీలను ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తూ, వారి ధాన్యం సొమ్ము 21 రోజుల వ్యవధిలో వారి బ్యాంకు అకౌంట్లోకి జమ చేసేందుకు సిద్ధంగా వున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను గన్ని బ్యాగ్స్ కొరత ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికలు అవసరంమని అందుకు తగ్గ విధంగా అధికారులు, సిబ్బంది జాగ్రత్తలు పాటించాలన్నారు.

కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్, ఆర్డీవో ఎస్. మల్లిబాబు, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ ఏ. కుమార్, జిల్లా పౌర సరఫరాల అధి కారి బి. విజయ భాస్కర్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, జెడ్పీ వైస్ చైర్ పర్సన్ పోసిన శ్రీలేఖ,మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గండ్రోతు అంజలీ దేవి, డ్వా పీడీ పి. జగదాంబ, డీఎల్డీవో వి. శాంతామణి, స్థానిక నాయుకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *