Breaking News

గుడ్ సమారిటన్ పై అవగాహనతో ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడాలి. – జిల్లా కలెక్టర్

-రోడ్డు భద్రత అవగహన పోస్టర్లు , కరపత్రాలు, బుక్ లెట్స్ ఆవిష్కరణ చేపట్టిన జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు దృష్టి పెట్టాలని, గుడ్ సమరిటిన్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా రోడ్డు భద్రతా కమిటి చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా రోడ్డు భద్రతా కమిటి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరుగుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అందిన రోడ్డు భద్రతా అవగాహన పోస్టర్ లు, కరపత్రాలు, బుక్ లెట్స్ ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డుప్రమాదాలు గత ఏడాదితో పోల్చితే ప్రమాదాలు తగ్గినా మరణాల శాతం తగ్గడం లేదని , రోడ్డు ప్రమాద భాదితులకు గోల్డన్ అవర్ మొదటి గంటలోపు వైద్య సహయం అందించే చర్యలు గుడ్ సమారిటన్ ద్వార చేపట్టడానికి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని, అప్పుడే ప్రమాద భాదితులను కాపాడగలమని ఎవరైతే సహాయం అందిస్తారో ఆ వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం రూ.5 వేలు పారితోషికం ఇస్తుందని తెలిపారు. దీనికి తోడు పోలిస్ , వైద్య శాఖ, ఎన్ ఐ సి సమన్వయంతో ఐ-రాడ్ యాప్ ద్వారా ప్రమాదబాదితుల వివరాలు అప్ లోడ్ చేస్తే ఆసుపత్రికి వెళ్ళిన వెంటనే చికిత్స ప్రారంభించడానికి అవకాశం కలుగుతుందని ప్రాణాలు కాపాడిన వారమౌతామని అన్నారు. గతంలో రోడ్డు మలుపులు బ్లాక్ స్పాట్స్ ఉండేవి దాదాపు ఇప్పుడు లేకున్నా రాష్ డ్రైవ్ కారణంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, నియంత్రించాలని, రహాదారుల వెంట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు వంటివి పక్కగా వుండాలని అన్నారు. తిరుమల ఘాట్ రోడ్డు ప్రయాణం నిర్దేశించిన సమయం పాటించేలా చూడాలని, శ్రీనివాస సేతు పై ఆర్ టి సి సహా వాహనదారులు ఆపోజిట్ (ఎదురుగా ) వస్తున్నారని గుర్తించామని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రదానంగా తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్ వద్ద సిగ్నల్ ఫ్రీ జంక్షన్ ఏర్పాటు ఐ ఐ టి సహకారంతో రూపుదిద్దు కోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో జిల్లా రోడ్డు భద్రతా కమిటి కన్వినియర్ మరియు జిల్లా రవాణా శాఖ అధికారి సీతారామి రెడ్డి , రాష్ట్ర రోడ్డు భద్రతా కమిటి మెంబర్ సునీల్ చక్రవర్తి , ట్రాఫిక్ డి ఎస్ పి నరసప్ప, ఆర్ అండ్ బి ఇ ఇ శ్రీనివాసులు, ఎన్ హెచ్, డి ఇ నాగరాజు, కార్పోరేషన్ ఎస్ ఇ మోహన్ , టి పి ఓ మధుసూదన్ , డి సి హెచ్ ఎస్ ఆనంద్ , డి ఎం హెచ్ ఓ శ్రీహరి, డి పి ఎం శ్రీనివాస రావు, ఎన్ ఐ సి ప్రసాద్, ఎస్ వి ఆర్ ఆర్, సూపరిన్ టెన్ డెంట్ రవిప్రభు, జిల్లా లోని మునిసిపల్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *