రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ 2023 సీజన్లో 3,23,441 ఎకరాలలో “ఈ పంట” నమోదు పూర్తి చేయడం అయినదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు.
జిల్లాలోని గ్రామాలలో అన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద ఈనెల 26.10.23 తేదీ నుండి 29.10.23 తేదీ వరకు ఈ పంట ముసాయిదా జాబితాను సామాజిక తనిఖీ కొరకు ప్రదర్శించబడుతుందని, మరియు గ్రామ సభలు కూడా నిర్వహించ నున్నట్లు తెలిపారు. ఈ గ్రామ సభలలో రైతు భరోసా కేంద్రాల సిబ్బంది ముసాయిదా జాబితాలో ఉన్న రైతుల ఈ పంట నమోదు అన్ని వివరములను సమగ్రముగా చదివి వినిపించడం జరుగుతుందన్నారు. కావున రైతు సోదరులు మీ రైతు భరోసా కేంద్రంలో సామాజిక తనిఖీ కొరకు ప్రదర్శించబడిన ముసాయిదా జాబితాను పరిశీలించి అభ్యంతరములు ఏమైనా ఉన్నట్లయితే సవరణ కొరకు మీ రైతు భరోసా కేంద్రంలో ఉన్న సిబ్బందిని సంప్రదించి అభ్యంతరములు లిఖిత పూర్వకంగా తెలియ జేయవలసిందిగా కోరుచున్నాము.
ఈ పంట ఖరీఫ్ 2023 సీజన్ సవరణ కొరకు ఇది ఆఖరి అవకాశం అని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు తెలిపారు. తుది జాబితా ప్రదర్శన తరువాత ఎటువంటి మార్పులు మరియు చేర్పులు చేయబడవని, ఈ విషయంలో క్షేత్ర సిబ్బంది అవగాహన కలిగించాలని కోరారు.
Prajavartha Online Telugu News