Breaking News

జిల్లా ఉపాధి కార్యాలయంలో నవంబర్ 10 వ తేదీ మినీ జాబ్ మేళా

-జిల్లా ఉపాధి కల్పన అధికారి హరిచ్చంద్ర ప్రసాద్

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో 10 వ తేదీన అనగా శుక్రవారం ఉదయం 09:30 గంటలకు డి మార్ట్ , బి న్యూ మొబైల్స్, పేటిఎం వంటి కంపెనీలు క్యాషియర్, కంప్యూటర్ ఆపరేటర్, స్టోర్ మేనేజర్, ఫీల్డ్ సేల్ ఎగ్జిక్యూటివ్ వంటి మొత్తం 260 ఉద్యోగాల కొరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కె. హరిచంద్ర ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఉపాధి కార్యాలయం, షెల్టన్ హోటల్ సమీపంలో, HP పెట్రోల్ పంప్ వెనుక, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా నందు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు రాజమహేంద్రవరం, తుని, కాకినాడ ప్రాంతాలలో పనిచేయాల్సింది ఉంటుందని తెలిపారు. విద్యార్హత పదో తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ వరకు చదువుకున్న, 18-35 సం.ల వయసు గల నిరుద్యోగ యువతి, యువకులు అర్హులు అని పేర్కొన్నారు. వీరికి జీతం రు. 11,500/- to 23,000/- రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. సహాయం కొరకు 8247437773, 8328486787 నెంబర్ సంప్రదించగలరని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *