Breaking News

దొమ్మేరులో విలేజ్ క్లినిక్ సెంటర్, గ్రామ సచివాలయ నూతన భవనాలను ప్రారంభించిన హోంమంత్రి తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందనని రాష్ట్ర హోంమత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. కొవ్వూరు రూరల్ మండల పరిధిలోని దొమ్మేరు గ్రామంలో 58 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన సచివాలయ భవనం, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ సెంటర్ ను ఆమె ప్రారంభించారు. గురువారం సాయంత్రం దొమ్మేరులో హోంమంత్రి తానేటి వనిత ముఖ్యఅతిథిగా హాజరై శిలాఫలకాలు ఆవిష్కరించి, రిబ్బన్ కత్తిరించి నూతన భవనాలను ప్రారంభించారు. ముందుగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు బాణాసంచాతో, తీన్ మార్ డప్పులతో ఆమెకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… నవరత్నాల ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికి అమ్మ ఒడి, చేయూత, విద్యాదీవేన, జగనన్న విద్యా కానుక, జగనన్న చేదోడు, వివిధ రకాల పెన్షన్లు వంటి వివిధ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా జగనన్న ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ద్వారా ఇంటికి లబ్ధి చేకూరేలా కృషి చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయకపోగా జన్మభూమి కమిటీల పేరుతో ఆఫీసుల చుట్టూ, నాయకుల చుట్టూ ప్రజలను తిప్పుకున్నారని ఎద్దేవా చేశారు. మళ్లీ ఎన్నికలు వస్తున్న సందర్భంగా గ్రామాల్లోకి మాయమాటలు చెప్పేందుకు ప్రతిపక్ష నాయకులు వస్తుంటారని.. మీకు, మీ కుటుంబానికి జరిగిన మంచిని చూసి నిర్ణయం తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వంలో తమ తమ గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేశారో ప్రతిపక్ష నాయకులను ప్రజలు నిలదీయాలన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి, జగనన్న ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి పై ఎలాంటి చర్చకైనా సిద్దమని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రజల కష్టాలను తెలుసుకొని చేస్తానని ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకున్నారన్నారు. మీ ఇంటి బిడ్డ జగనన్నను మరోసారి ఆశీర్వదించాలని హోంమంత్రి తానేటి వనిత కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ నాయకులు, గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *