కాకినాడ జిల్లా, సూరంపాలెం గ్రామం, నేటి పత్రిక ప్రజావార్త :
కాకినాడ జిల్లా సూరంపాలెం గ్రామం, ఆదిత్య నగర్, అదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, క్రీడా మైదానం నందు కాకినాడ జేఎన్టీ యూనివర్సిటీ వారు ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి సౌజన్ ఇంటర్ యూనివర్సిటీ కబడి మెన్ 2023- 24 కార్యక్రమానికి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ముఖ్యఅతిథిగా విచ్చేసారు. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడి మెయిన్ టోర్నమెంట్ 2023 – 24 ని ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ టోర్నమెంట్స్ నవంబర్ 9 వ నుండి 12వ తారీకు వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులందరికీ ..ముందుగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈరోజు మన కాకినాడ జే ఎన్టీయూ, ఆదిత్య కళాశాలల యాజమాన్యం కలిసి ఇంత పెద్ద ఎత్తున ఈ కబడ్డీ పోటీలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఈ సౌత్ జోన్ పోటీల్లో ఆరు రాష్ట్రాల నుండి…113 యూనివర్సిటీల నుండి విద్యార్థులు హాజరుకావడం చాలా సంతోషంగా ఉంది. ఇన్ని వందల మంది కబడ్డీ ప్లేయర్స్ వచ్చారంటేనే ఈ టోర్నమెంట్ ఎంత…ప్రతిష్టాత్మకమైనదో అర్థమవుతోంది. ఈ సౌత్ జోన్ పోటీల్లో మన ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల కబడ్డీ ప్లేయర్స్ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ కబడ్డీ…పోటీలను చూస్తుంటే…ఈ మధ్య బాగా ఫేమస్ అయిన ప్రో కబడ్డీ పోటీలకు ధీటుగా …కనిపిస్తుంది. కబడ్డీ మన దేశ క్రీడ. ఎన్నో దశాబ్ధాలుగా మన మట్టిమీద కబడ్డీ ఆడుతునే ఉన్నారు. మట్టిమీద మొదలైన ఈ కబడ్డీ ఇప్పుడు బాగా అభివృద్ధి చెంది మ్యాట్ మీదకు వచ్చింది. ఇప్పుడు ఈ కబడ్డీ గల్లీ కబడ్డీ నుండి ఢిల్లీ కబడ్డీ గానే కాదు….ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ గేమ్ గా కూడా మారింది. ఇంత మంచి టోర్నమెంట్ ని ప్రారంభించినందుకు క్రీడా శాఖ మంత్రిగా నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ వేదిక మీద మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కబడ్డీ గేమ్ లో ద్రోణాచార్య అవార్డును పొందిన ఇ. ప్రసాదరావు కూడా ఉండటం నిజంగానే మీ అందరికీ ఓ గొప్ప ఇనిస్పిరేషన్. క్రీడాకారుడైన…ప్రసాదరావుగా మన తెలుగు వారు కావడం, మన తెలుగుగడ్డ మీద కూత పెట్టి. అంతర్జాతీయ జాతీయ స్థాయిలో కబడ్డీ ప్లేయర్ గా ద్రోణాచార్య అవార్డు అందుకోవడం….నిజంగా మనందరికీ గర్వకారణం. మీముందు కూర్చన్న ప్రసాదరావు గారు…మామూలు సాధారణమై గురువు కాదు. ఏకంగా 15 దేశాలకు కబడ్డీ కోచ్ గా వ్యవహరించారంటే…..ఆయన ఎంత గొప్ప ఆటగాడో…ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇక్కడున్న మీరంతా…మీరు ఏ రాష్ట్రం వారైనా..ఏ యూనివర్సిటీ వారైనా…ప్రసాదరావుగారిని స్ఫూర్తిగా తీసుకుని…ఈ కబడ్డీలో రాణించి.మీ యూనివర్సిటీకి…మీ రాష్ట్రానికే కాదు…ఈ దేశానికి కూడా మంచి పేరు తేవాలని కోరుతున్నాను. ఏ రంగానికి లేని ఓ ప్రత్యేకత ఒక్క క్రీడా రంగానికే ఉంటుంది. ఒక్క క్రీడా కారుడు మాత్రమే…ఓ రాష్ట్రానికి…ఓ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఎంత పెద్ద కాంపిటీషన్ అయినా….ఎంత గొప్ప ప్లేయర్ అయినా….గ్రౌండ్ లోకి మనం అడుగు పెట్టాక….మనం కాన్ఫిడెన్స్ తో ఆడితే చాలు… విజయం వరిస్తుంది…ఎవ్వరేూ….భయపడొద్దు….మీ ఒంట్లో సత్తా….గుండెల్లో ధైర్యం ఉండే….ఎంత పెద్ద టార్గెట్ నైనా రీచ్ అవ్వొచ్చు… క్రీడలు….టేలెంట్…..ఎవ్వరి సొత్తూ కాదు….డబ్బు…పేదరికం అన్న తేడా కూడా ఉండదు….మనం మనలో టాలెంట్ ని గుర్తిస్తే…..అంతర్జాతీయ స్థాయికి ఎదగగలుగుతాం…ఆట ఆడినా…ఓడినా రికార్డుల్లో ఉంటాం…కానీ…గెలిస్తేనే చరిత్రలో ఉంటాం…కనుక గెలవడం కోసం….రాజీలేకుండా పోరాడండి. గెలుపు…ఓటమి రెండు మూడక్షరాలే…కానీ ఓటమి నిరుత్సాహాన్నిస్తుంది… గెలుపు… మరో గెలుపునిస్తుంది..ఇది ఇక్కడున్న ప్రతీ ఒక్క కబడ్డీ ప్లేయర్…ప్రతీ టీమ్…గుర్తుపెట్టుకొండిమీ మీద పూలు వేస్తే…వాటిని దండగా మార్చి దేవుడికి వేసి ఆశీర్వాదం తీసుకొండిమీరు వెళ్లే మార్గంలో…మీ మీద రాళ్లు వేస్తే…ఆ రాళ్లతో మీ విజయానికి పునాది వేయండిమీరు వెళ్లే మార్గంలో….మీరు గాయపడినా…ఎవరైనా దాడి చేసినా…ఆ రక్తంతో మీ విజయ చరిత్రను రాయండి. అంతే కానీ…ఆటలోనైనా…జీవితంలోనైనా…వెనకడుగు వేయొద్దు…కబడ్డీలో….కూతకొచ్చే వాడిని పట్టుకోవడానికి వెనకడుగు వేయొచ్చు కానీ మీ నిజజీవితంలో మాత్రం…మీ లక్ష్యాన్ని సాధించే వరకు ఎవ్వరూ వెనకడుగు వేయొద్దు…అర్థమైందా….రాజా…?క్రీడాకారులు రాణిస్తే….ఎవ్వరికీ లభించని కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి…నిప్పులు చిమ్ముతూ….రాకెట్ దూసుకెళుతుంటే…అంతా ఎలా నిభిడాశ్చర్యంతో చూస్తారో… మీ క్రీడా ప్రపంచంలో…ఇక్కడున్న మీరంతా సక్సెస్ శిఖరాలకు దూసుకెళుతుంటే….అందరూ గర్వపడాలి…క్రీడాకారులకు ఈ రాష్ట్రంలో మంచి రోజులొచ్చాయి…కనుక మీరెక్కడా రాజీ పడకుండా ప్రాక్టీస్ చేయాిలని సూచిస్తున్నా. ఎందుకంటే…ఈ రాష్ట్రంలో ….ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు..వచ్చే నెలలోనే ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆడుదాం ఆంధ్రా అన్న గొప్ప క్రీడా ఉత్సవాలను మన రాష్ట్రంలో నిర్వహిస్తున్నాం అని తెలిపారు….కార్యక్రమం హేమ చంద్ర రెడ్డి చైర్మన్, APSCHE, ద్రోణాచార్య అర్జున అవార్డు గ్రహీత ప్రఖ్యాత కబడ్డీ కోచ్ ప్రసాద్ రావు (కబడి రావు), కే పద్మా రాజు, వైస్ ఛాన్సెలర్ AKNU, రాజమహేంద్రవరం, ప్రసాద్ రాజు వైస్ ఛాన్సెలర్, JNTUK, కాకినాడ, శేషారెడ్డి, చైర్మన్, ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్ సతీష్ రెడ్డి , వైస్ చైర్మన్, ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కబడ్డీ కోర్సులు , కబడ్డీ క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News