Breaking News

ఓటు పై సందేహాలను కేవలం ఫోన్ కాల్ ద్వారానే తెలుసుకోవచ్చు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గ ఓటర్లు తమ ఓటు పై సందేహాలను కేవలం ఫోన్ కాల్ ద్వారానే తెలుసుకోవచ్చని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ ప్రదాన కార్యాలయంలో ఓటర్ హెల్ప్ డెస్క్ ని కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఓటర్లకు తమ ఓటుకు సంబంధించిన ఏ సందేహం ఉన్నా తీర్చడానికి వీలుగా నగరపాలక సంస్థ ప్రదాన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ని ఏర్పాటు చేశామన్నారు. తూర్పు నియోజకవర్గానికి 0863-2345104, పశ్చిమ నియోజకవర్గానికి 2345105 నంబర్లను ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా ఆపరేటర్లను నియమించామన్నారు. ఓటర్లు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:30 గంటల లోపు ఫోన్ చేసి తమ ఓటుకి సంబందించి ఏ సందేహం ఉన్నా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. హెల్ప్ డెస్క్ లో నిర్దేశిత సమయంలో సిబ్బంది ఉండాలని, ఓటర్ల నుండి అందే ఫోన్ కాల్స్ ని పోలింగ్ బూత్ ల వారిగా సమగ్ర వివరాలతో రిజిస్టర్ లో నమోదు చేయాలని మేనేజర్ ని ఆదేశించారు. సమావేశంలో ఎంహెచ్ఓ డాక్టర్ భాను ప్రకాష్, బయాలజిస్ట్ మధుసూధన్, మేనేజర్ శివన్నారాయణ, వివిధ విభాగాల సూపరిండెంట్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *