Breaking News

గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల వివరాలు అందించండి…. : జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రుక్మాంగదయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ జన జాతీయ గౌరవ దినోత్సవ కార్యక్రమాన్ని ఈనెల 15 వ తేదీ నుండి 26వ తేదీ వరకు గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల సంస్మరణ వేడుకలను గిరిజనుల యొక్క సంస్కృతి, సాంప్రదాయములను పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున నిర్వహించేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా జిల్లా స్థాయి వేడుకలు, జిల్లాలో ఈనెల 15వ తేదీ బుధవారం ఉదయం 10:00 గంటలకు పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో నిర్వహించడం జరుగుతుంద న్నారు.ఈ వేడుకల్లో ఇంకను గుర్తింపు రాని గిరిజన స్వాతంత్ర్య సమరయోధులు వున్న యెడల వారికి కూడా సన్మానము చేసి వారి సేవలను కొనియాడి గౌరవించ వలసి వున్నదన్నారు. దీనిలో భాగంగా జిల్లాకు చెందిన గుర్తింపబడని గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల వివరాలను తెలియ జేసిన యెడల పరిశీలించి పై వేడుకల్లో సన్మానము చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఇతర వివరాలకు జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారి, ఎన్.టి.ఆర్. జిల్లా రుక్మాంగదయ్య (949 095 7017) సంప్రదించవచ్చునని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *