Breaking News

అధికారులు, సిబ్బంది జవాబుదారీ తనం తో కూడి సేవలు అందించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం స్పందనలో 24 అర్జీలు స్వీకరించడం జరిగిందని మునిసిపల్ అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి పేర్కొన్నారు. సోమవారం ఉదయం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను మున్సిపల్ కమిషనర్ వారి తరఫున అదరపు కమిషనర్  పీఎం సత్యవేణి స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీమతి పీఎం మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చే అర్జీల విషయంలో సత్వర పరిష్కారం కోసం అధికారులు, సిబ్బంది జవాబుదారీ తనం తో కూడి సేవలు అందించాలని ఆదేశించారు. డ్రైనేజీ, అక్రమ నిర్మాణాలు తొలగించవలసినదిగా కోరుట, పింఛన్లు, పారిశుద్యం, వీధి దీపాలు, మంచినీరు, రోడ్లు, ఇండ్ల ప్లాను కోరుట, అడ్డుగా ఉన్న కరెంటు తీగలు తొలగించ వలసిందిగా కోరుట వంటి  తదితర అంశాలపై 24 వినతులు స్వీకరించామన్నారు. స్పందనలో సిటీ ప్లానర్ జీవి ఎస్ ఎన్ మూర్తి,, సూపరింటండెంట్ ఇంజినీర్ జీ. పాండురంగ రావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *