Breaking News

కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాల సందర్భంగా వచ్చే భక్తుల సౌకర్యానికే తొలి ప్రాధాన్యమివ్వాలి

-జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాల సందర్భంగా మంగినపూడి బీచ్ కు అధిక సంఖ్యలో వచ్చే భక్తుల సౌకర్యానికే తొలి ప్రాధాన్యమివ్వాలని కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ అధికారులను ఆదేశించారు

సోమవారం సాయంత్రం ఆమె మంగినపూడి బీచ్ ను సందర్శించి వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి డాక్టర్ అపరాజిత సింగ్ వివిధ శాఖల అధికారులతో మాట్లాడుతూ, ఈ నెల 26 ( ఆదివారం ) , 27 తేదీల్లో మంగినపూడి బీచ్‌కు లక్ష నుండి రెండు లక్షల మంది భక్తులు సముద్ర స్నానాలు చేసేందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. నగరం నుండి మంగినపూడి బీచ్‌కు 50 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కోనేరుసెంటర్, బస్టాంట్, పాండురంగ స్వామి టెంపుల్ తదితర పాయింట్ల వద్ద సూపర్ వైజర్లను ఏర్పాటు చేసినట్లు మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు జాయింట్ కలెక్టర్‌కు తెలియజేశారు. వాహనాలు, ట్రాఫిక్ నియంత్రణకు మంగినపూడి బీచ్ బడ్డీల సెంటర్ వద్ద నుండి బీచ్‌కు వన్ వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు డీఎస్పీ కలెక్టర్‌కు తెలిపారు. సాధారణ వాహనాల, విఐపీ ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. డ్రోన్ కెమెరాలతో బీచ్ ఏరియా అంతా పర్యవేక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్‌కు వివరించారు. మైక్ ద్వారా ఎప్పటికప్పుడు యాత్రీకులకు తగు సూచనలు చేయుటకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, కార్తీక పౌర్ణమికు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్ల విషయంలో వెనకాడ రాదని సూచించారు. దత్తాశ్రమంను సందర్శించే భక్తులకు లోపలికి వచ్చేందుకు ఒక ద్వారం వెలుపలకు వెళ్లేందుకు మరొక ద్వారం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు, అక్కడ ఎటువంటి రద్దీ జరక్కుండా బారికేట్లను ఏర్పాటు చేయాలని సూచించారు.. ముఖ ద్వారం సమీపంలో ఉన్న చెట్ల ఎండు కొమ్మలను తొలగించాలని, అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఏర్పడరాదన్నారు. 12 నూతుల వద్ద స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకర్తల ద్వారా భక్తులను సక్రమంగా స్నానాధులను ముగించుకునేలాగా సౌకర్యాలు కలిగించాలన్నారు. మొబైల్ పార్టీ జట్లు, అంబులెన్స్ సౌకర్యం గజ ఈతగాళ్లు బీచ్ వద్ద అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు.బంటుమిల్లి ప్రాంతం నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం పెదపట్నం గొల్లగూడెం బీచ్ వద్ద సముద్ర స్నానానికి ఏర్పాట్లు సైతం చేయాలని, అక్కడ సైతం గజ ఈతగాళ్లను రెండు పడవలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రథమ చికిత్స కేంద్రాలు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. బీచ్ వద్ద మూడు షిప్టులలో శానిటరీ వర్కర్లు, పంచాయతీ సెక్రటరీలు, సూపర్‌వైజర్లు ఈ విధంగా మొత్తం
500 మందికి పైగా సిబ్బందిని శానిటేషన్ కోసం నియమిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. చిలకలపూడి పాండురంగ స్వామి ఆలయం నుండి బీచ్ వరకు 8 పాయింట్లు ఏర్పాటు చేసి మంచినీటి సరఫరా చేర్పాటు చేయాలన్నారు. బీచ్ వద్ద మహిళలు దుస్తులు మార్చుకొనుటకు 80 తాత్కాలిక గదులు ఏర్పాటు చేస్తున్నట్లు0 తెలిపారు. యాత్రీకుల పంపిణీకి పులిహోర ప్యాకెట్లు సిద్ధం చేయాలన్నారు. మత్స్యశాఖ ద్వారా బోట్లను,గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుతున్నట్లు తెలిపారు. ఎన్‌డీఎఫ్, ఎస్‌డీఆర్ఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. కార్తీక పౌర్ణమి రోజున బీచ్ వద్ద వికలాంగులు, వృద్ధులు, చిన్న పిల్లలను సముద్ర స్నానం వద్దకు తీసుకువెళ్లటానికి రవాణా శాఖ ద్వారా ఉచిత ఆటోలు ఏర్పాటు చేయాలని, అలాగే సముద్ర తీరాన ఉన్న శివుని విగ్రహాన్ని పెయింటింగ్ వేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. మంగినపూడి బీచ్ సమీపంలో విపరీతంగా పెరిగిపోయిన తుమ్మ చెట్ల పొదలను తక్షణమే తొలగించాలని రోడ్లు భవనాల శాఖ ద్వారా జరిగే జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమం ఎంతో చిత్తశుద్ధితో జరగాలని మరో రెండు రోజుల తర్వాత తానే స్వయంగా వచ్చి ఆయా పనులు ఏ మేరకు జరిగేయో పర్యవేక్షిస్తానని జాయింట్ కలెక్టర్ తెలిపారు. 26 వ తేదీ రాత్రి నుంచి బీచ్ ఒడ్డున మూడు లైటింగ్ టవర్లను 125 కె.వి. సామర్థ్యం గల జనరేటర్ ను సిద్ధం చేస్తున్నట్లు బడ్డీలు సెంటర్ నుంచి బీచ్ వరకు లైటింగ్ ఉంటుందని డ్వామా పిడి జీవి సూర్యనారాయణ జాయింట్ కలెక్టర్ కు వివరించారు.

కార్తీక పౌర్ణమి ఏర్పాట్ల పరిశీలన కోసం జరిగిన బీచ్ సందర్శన కార్యక్రమంలో మచిలీపట్నం ఆర్డీవో ఎం. వాణి, తహసిల్దార్ శ్రీవిద్య, టూరిజం శాఖ జనరల్ మేనేజర్ జి. రామ లక్ష్మణ్, మచిలీపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుభాష్ చంద్రబోస్, తాళ్లపాలెం మాజీ సర్పంచ్ వాలిశెట్టి రవిశంకర్, వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *