Breaking News

స్మృతివనం నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయండి

-నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, బందర్ రోడ్ స్వరాజ్ మైదానం లో నిర్మిస్తున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతులను భావితరాలకు అందించేలా నిర్మాణం అవుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం త్వరగా పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీ పడకూడదని సోమవారం కమిషనర్ పర్యటనల లో పరిశీలించి ఆదేశాలిచ్చారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను చూపించే మ్యూజియం, అంబేద్కర్ బాల్యం నుండి రాజ్యాంగం రాసేంతవరకు అంటే అంబేద్కర్ బాల్యం, విద్య, ఉద్యోగం, రాజకీయ జీవితం, పోరాటం రాజ్యాంగ నిర్మాణంలోని ఘట్టాలకు సంబంధించిన ఛాయ చిత్రాలను వస్తువులను ప్రదర్శించేందుకు మ్యూజియం ను ఏర్పాటు ద్వారా అంబేద్కర్ పడ్డ కష్టాలు, ఆయన చేసిన సేవలు భావితరాలకు ఎంతగానో స్ఫూర్తిదాయకమని ఆ నిర్మాణ పనుల్లో ఎటువంటి లోపం లేకుండా జరగాలని, ప్రపంచవ్యాప్తంగా సందర్శకులు సందర్శించే 125 అడుగుల కాంస్య విగ్రహం ఉన్న స్మృతి వనం అత్యంత సుందరంగా, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను చూపించే విధంగా నిర్మాణ పనుల జరుగుతున్నాయా లేదా అని పరిశీలించారు. ప్రాజెక్ట్ మేనేజర్ జావీద్ తో నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకుంటూ త్వరగా పూర్తి చేయాలని ఆదేశం ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *