-60 వ డివిజన్ ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రతి ఇంటా సంతోషం వెల్లివిరిసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 60 వ డివిజన్ వాంబేకాలనీ డి బ్లాక్ లోని 264 వ వార్డు సచివాలయ పరిధిలో గురువారం జరిగిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ డివిజన్ అధ్యక్షులు బత్తుల దుర్గారావు, డివిజన్ ఇంచార్జి బెవర నారాయణతో కలిసి ఆయన పాల్గొన్నారు. మొదట మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఘన నివాళులు అర్పించి.. పార్టీ జెండాను ఆవిష్కరించారు. సచివాలయంలో సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులతో కూడిన బోర్డును ఆవిష్కరించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమై ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలను ఎలా కత్తిరించాలా అని చంద్రబాబు సర్కారు ఆలోచన చేస్తే.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అర్హులను వెతికి మరీ లబ్ధి చేకూరుస్తున్నట్లు తెలిపారు. 264 వ వార్డు సచివాలయ పరిధిలో గత నాలుగున్నరేళ్లలో డీబీటీ ద్వారా 12 కోట్ల 65 లక్షల 6 వేల 754 రూపాయల మేలు చేకూర్చగా.. నాన్ డీబీటీ ద్వారా 8 కోట్ల 31 లక్షల 34 వేల 677 రూపాయలు.. మొత్తంగా 20 కోట్ల 96 లక్షల 41 వేల 431 రూపాయల లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. అలాగే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి నిరంతరం ప్రక్రియగా కొనసాగుతున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు, సచివాలయ సిబ్బంది, కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News