విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓట్లర నుండి అందిన అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించడం ద్వారా దోషరషిత తుది ఓటర్ల జాబితాను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢల్లీి రావు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు.
సంక్షిప్త ఓటర్ల జాబితా పై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా నగరంలోని ఆయన ప్రధాన కార్యాలయం నుండి శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ నమోదుపై ప్రజల నుండి స్వీకరించి పెండిరగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రస్తుత స్థితి, ముఖ్యంగా 30 రోజులకు పైగా పెండిరగ్‌లో ఉన్న ఫారమ్‌లు మరియు ఎస్‌ఎస్‌ఆర్- 2024 సమయంలో స్వీకరించిన ఫారమ్‌లు, అనోమలిస్ పెండిరగ్, ముసాయిదా జాబితాపై ఓట్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు, పెండిరగ్, రాజకీయ పార్టీల ఫిర్యాదులు, ఈరోల్‌పై నివేధికలు, ఎపిక్ కార్డుల జనరేషన్ పంపిణీ, పీఎస్‌ఈలు, డీఎస్‌ఈలు, తదితర అంశాలపై జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని కాన్ఫరెన్స్ ద్వారా ముఖేష్ కుమార్ మీనా సూచించారు.
నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలోని వీడియోకాన్ఫరెన్స్ హాల్ నుండి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతివారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సంక్షిప్త సవరణ, తుది ఓటర్ల జాబితా రూపొందించడం పై సమావేశాలు నిర్వహిస్తూ అభ్యంతరాలు, క్లైయిమ్స్ పరిష్కరిస్తున్నామన్నారు. నేటి వరకు ఓటర్ల జాబితాపై చేపట్టిన ప్రక్రియలను వివరిస్తూ అక్టోబర్ 27 తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసిన నాటి నుండి నేటి వరకు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుండి ఫారం 6,7,8 దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. ఇప్పటివరకు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా 71,827 దరఖాస్తులు రాగా వాటిని క్షేత్రస్థాయిలో విచారించి అంగీకరించిన 27,933 దరఖాస్తులను ఈరోల్ లో అప్డేట్ చేశామని, ఇంకనూ పెండిరగ్‌లో ఉన్న 36,285 ధరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పెండెన్సీ ఎక్కువగా ఉన్న జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాలలోని బిఎల్‌వోలు, ఏఇఆర్‌వోలు, ఇఆర్‌వోలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసిన నాటి నుండి నేటి వరకు నమోదు అయిన ఫారం 6 సంబంధించి 12,569 దరఖాస్తులు రాగా, ఇంకనూ పెండిరగ్‌లో ఉన్న 7,853, ధరఖాస్తులను పరిష్కరిస్తున్నామని, ముఖ్యంగా 30 రోజులకు పైగా పెండెన్సీలో ఉన్న వాటి పై దృష్టి పెట్టామన్నారు. ఫారం 7కు సంబంధించి 21,675 దరఖాస్తులు రాగా వాటిలో పెండిరగ్‌లో ఉన్న 10,208 ధరఖాస్తులను, ఫారం 8 లో 37,569 దరఖాస్తులు రాగా వాటిలో పెండిరగ్‌లో ఉన్న 18,210 దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుని ఈరోల్ లో అప్డేట్ చేస్తున్నామన్నారు. ప్రతి దరఖాస్తును బిఎల్‌ఓ లు, ఏఈఆర్వో లు,ఈ ఆర్వోలు క్షేత్రస్థాయిలో పరిశీలించి విచారణ చేస్తున్నారని అన్నారు. జిల్లాలో 18 నుండి 19 సంవత్సరాలు నిండిన యువతను ఓటర్లగా నమోదు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల సంబంధించి వివిధ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వీలుగా నోడల్ అధికారుల నియామకం పూర్తి చేశామని కలెక్టర్ ఢల్లీి రావు ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండర్క్ , డిఆర్‌వో ఎస్.వి. నాగేశ్వరరావు, నియోజకవర్గ ఇఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ సిహెచ్ దుర్గాప్రసాద్, ఉన్నారు.
Prajavartha Online Telugu News