హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై క్విజ్ పోటీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యన్.టి.ఆర్ జిల్లా ఎయిడ్స్ నియంత్రణా విభాగం, స్నేహ మరియు వాసవ్య మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో గవర్నమెంట్ పాఠశాలల విధ్యార్ధులకు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై మంగళవారం స్థానిక బిషప్ అజరయ్య పాఠశాల నందు క్విజ్ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా స్నేహ సంస్థ ప్రివెంషన్ యూనిట్ ప్రాజెక్ట్ మెనేజరు కె.రవిశంకర్ మాట్లాడుతూ యన్.టి.ఆర్ జిల్లా ఎయిడ్స్ నియంత్రణా విభాగం సహకారంతో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా విజయవాడలోని గవర్నమెంట్ పాఠశాలలకు హెచ్.ఐ.వి పై క్విజ్ పోటీలను ఏర్పరచామని ఇందులో కె.యస్.ఆర్ జడ్ పి, కె.బి.సి.జడ్ పి, బిషప్ అజరయ్య, బోయపాటి శివరామ కృష్ణయ్య, గాంధీ మున్సిపల్, యస్.కె.పి.వి.పి హైస్కూల్లు నుండి విధ్యార్ధినీ విధార్ధులు పాల్గొన్నారన్నారు. ఇందులో మొదటి బహుమతిని కె.బి.సి.జడ్.పి. బాలుర పాఠశాలవారు, ద్వితీయ బహుమతిని బోయపాటి శివరామ కృష్ణయ్య హైస్కూలు వారు, మూడవ బహుమతిని బిషప్ అజరయ్య పాఠశాల గెలుపొందిందని ఆయన అన్నారు. వీరికి నగదు బహుమతితో పాటుగా ప్రశంసాపత్రాలను శుక్రవారం జరిగే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నాడు స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అందజేస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవ్య మహిళా మండలి సిబ్బంది వి. రాజామోహన్, కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *