Breaking News

మిచౌంగ్‌ తుఫాను హెచ్చరికల నేపధ్యంలో రైతాంగాన్ని ఆదుకోండి.

-ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం డిమాండ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మిచౌంగన తుఫాను హెచ్చరికల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్‌ ఒక ప్రకటనలో డిమాండన చేశారు. మిచౌంగ్‌ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్నది. రైతాంగం వరి కోతలు, నూర్పిళ్ళు, పత్తి తీతలు, మిర్చి కోతలు కోసి ఎండబెట్టడంలాంటి వ్యవసాయ పనులలో నిమగ్నమైనారు. తుఫాను హెచ్చరికలతో తమ పంట ఉత్పత్తులు తడిసిపోతాయని తీవ్ర నష్టం జరుగుతుందనే భయాందోళనలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కల్లాల్లో, రోడ్లపై ఆరబెట్టుకొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ధాన్యం తడిసిపోకుండా నూర్చిన ధాన్యాన్ని రైతులు తక్షణం అమ్ముకొనేలా ప్రభుత్వం ఆర్‌.బి.కె.ల ద్వారా ఎటువంటి అడ్డంకులు కల్పించకుండా కొనుగోలు చేయాలి. పంట ఉత్పత్తులు ఆరబెట్టుకొనేందుకు, తడవకుండా కాపాడుకునేందుకు రైతాంగానికి 90% సబ్సిడీతో పాస్టిక్‌ పట్టాలు అందచేయ్యాలి. వరి ధాన్యం నింపుకొనేందుకు అవసరమైన గోతాలు ఆర్‌.బి.కె.ల ద్వారా సరఫరా చేయ్యాలి. రైతాంగం వద్ద ఆర్‌.బి.కె. సెంటర్లలో నిల్వ ఉన్న ధాన్యాన్ని తక్షణం మిల్లులకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కె.వి.వి.ప్రసాద్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *