Breaking News

ఎక్కడా ప్రాణ నష్టం కల్గకుండా అధికారులు ముందస్తు చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మిచౌంగ్ తుఫాన్ తీవ్రత వలన జిఎంసి పరిధిలో ఎక్కడా ప్రాణ నష్టం కల్గకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని, పీకలవాగు చుట్టుపక్కల, పురాతన భవనాల్లో నివాసం ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం కమిషనర్ జాతీయ రహదారి, పాత గుంటూరు, వేలాంగిని నగర్, ఏటుకూరు రోడ్, బుడంపాడు రోడ్, బాలాజీ నగర్, నల్లచెరువు తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలను, అవుట్ ఫాల్ డ్రైన్ లను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తుఫాన్ తీవ్రత పెరుగుతున్న రీత్యా నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జిఎంసి అధికారులు నగర పరిధిలో ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ప్రత్యేక శ్రద్ధతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రదానంగా గతంలో జరిగిన ప్రాణ నష్టం పునరావృతం కాకుండా పీకలవాగు చుట్టు పక్కల నివాసితులు వర్షం వలన వాగు పొంగే ప్రమాదం ఉన్నందున వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలన్నారు. తప్పనిసరి పరిస్తితుల్లో మినహా ఇళ్ల నుండి బయటకు రావద్దని హితవు పలికారు. అలాగే పురాతన భవనాల్లో నివాసం ఉండేవాళ్ళు కూడా వర్షాలు పెరిగితే గోడలు నాని కూలిపోయే అవకాశం ఉందని, తుఫాన్ తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నగరంలో డబల్ సెల్లార్ తో నిర్మాణంలో ఉన్న భారీ భవనాల యజమానులు, పరిసర ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ఎటువంటి సమస్య ఉన్నా 24 గంటలు అందుబాటులో ఉండే జిఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 0863-2345103 కి కాల్ చేయవచ్చన్నారు. జిఎంసి ఉన్నతాధికారులతో తుఫాన్ పర్యవేక్షణకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు.
తొలుత క్షేత్ర స్థాయి పర్యటనలో పలు ప్రాంతాల్లో అవుట్ ఫాల్ డ్రైన్లలో మురుగుపారుదలకు పూడిక, వ్యర్ధాల అడ్డంకి గమనించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి, అవుట్ ఫాల్ డ్రైన్లలో యుద్దప్రాతిపదికన పూడిక, ప్లాస్టిక్ వ్యర్ధాలు తొలగించాలని ఇంజినీరింగ్, ప్రజారోగ్యాధికారులను ఆదేశించారు. తొలగించిన పూడికతీత పనుల వివరాలను అందించాలని ఈ.ఈ.లను ఆదేశించారు. వర్షాలకు డ్రైన్ల కల్వర్ట్ ల వద్ద అడ్డంకులు లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రజరోగ్యాధికారులకు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా నీటిని బెయిల్ అవుట్ చేయడానికి ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు సమన్వయంతో వ్యవహారించాలని ఆదేశించారు. ప్రధాన రహదారుల్లో ఎక్కడైనా చెట్ల కొమ్మలు విరిగితే వాటిని వెంటనే తొలగించడానికి పార్క్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఏడీహెచ్ ని ఆదేశించారు. త్రాగునీరు సరఫరా జరిగే రిజర్వాయర్లలో విద్యుత్ అంతరాయం కల్గినా సమస్యలు లేకుండా ముందస్తుగా జనరేటర్లని సిద్దం చేసుకోవాలని ఏ.ఈ.లను ఆదేశించారు. తుఫాన్ పరిస్థితుల దృష్ట్యా సచివాలయాల వారీగా కార్యదర్శులు, అధికారులు అందుబాటులో ఉండాలని, వాలంటీర్ల ద్వారా ప్రజలకు తుఫాన్ తీవ్రత పై అవగాహన కల్గించాలని ఆదేశించారు.
పర్యటనలో ఎస్.ఈ.(ఎఫ్ఏసి) సుందరరామిరెడ్డి, ఈఈ కొండారెడ్డి, ఏఈ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఐజాక్, సునీత, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *