Breaking News

మిచౌంగ్ తుఫాన్ గాలుల వలన హోర్డింగ్స్, బోర్డ్లు వద్ద ముందస్తు జాగ్రత్త చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మిచౌంగ్ తుఫాన్ గాలుల వలన హోర్డింగ్స్, బోర్డ్లు వద్ద ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా ఉండే హోర్డింగ్స్ ని వెంటనే తొలిగించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి పట్టణ ప్రణాళికాధికారులు, హోర్డింగ్స్ యజమానులకు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ ఆదేశాల మేరకు సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్ ఆయా హోర్డింగ్స్, బోర్డ్ ల యజమానులకు నోటీసులు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం ఈదురుగాలులు వేగంగా వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్ రోడ్ల మీద విరిగి పడకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, హోర్డింగ్స్ యజమాని తమ హోర్డింగ్స్ వలన ఏ సమస్య తలెత్తకుండా భాధ్యత తీసుకోవాలన్నారు. హోర్డింగ్స్, బోర్డ్ ల వలన ఏ ప్రమాదం జరిగినా సదరు హోర్డింగ్ యజమానే పూర్తి భాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. టిపిఎస్ లు తమ పరిధిలోని ప్రధాన సెంటర్లలోని హోర్డింగ్స్ ని ప్రత్యక్షంగా పరిశీలించి, ఏమైనా సమస్య ఉంటే వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు కూడా తమ పరిధిలోని హోర్డింగ్స్ ని పరిశీలించి, ఏమైనా డ్యామేజ్ లేదా ప్రమాదకరంగా ఉంటే వెంటనే ఉన్నతాధికారులు, యజమానుల దృష్టికి తీసుకురావాలన్నారు. ముందస్తు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
తుఫాన్ తీవ్రత దృష్ట్యా జిఎంసి గాంధీ పార్క్ ని సోమవారం నుండి క్లోజ్ చేస్తున్నామని, తుఫాన్ ప్రభావం తగ్గిన తదుపరి పునః ప్రారంభం చేస్తామని కమిషనర్ తెలిపారు. నగర ప్రజలు పార్క్ క్లోజ్ చేసిన విషయాన్నిగమనించి, నగరపాలక సంస్థకు సహకరించాలని కోరారు. అలాగే గుంట గ్రౌండ్ లో కూడా ఎగ్జిబీషన్ లకు తుఫాన్ తగ్గే వరకు అనుమతులు ఇవ్వవద్దని అధికారులను ఆదేశించామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *