-స్పందనలో 80 అర్జీలు నమోదు…
-జిల్లా జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన ద్వారా స్వీకరించిన ఆర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపి ఆర్జీదారుడు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్, సబ్ కలెక్టర్ అదితి సింగ్తో కలిసి ప్రజల నుండి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆర్జీదారులు సుదూర ప్రాంతాల నుండి తమ సమస్య పరిష్కారం కోసం స్పందన కార్యక్రమానికి రావడం జరుగుతుందన్నారు. స్పందన పై ఆర్జీదారుడు పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా అధికారులు సమస్యలను పరిష్కరించుటకు చొరవ చూపాలన్నారు. ఆర్జీదారుడు మరోక సారి స్పందన కార్యక్రమానికి వచ్చి సమస్య పరిష్కారం కాలేదనే బాధను వ్యక్త పరిచే పరిస్థితి లేకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన్నప్పుడే స్పందన లక్ష్యం నేరవేరుతుందన్నారు. ప్రతి ఆర్జీని అధికారులు వ్యక్తిగత సమస్యగా భావించి పరిష్కార మార్గం చూపాలన్నారు. స్పందనలో వచ్చిన ఆర్జీ పరిష్కారానికి సంబంధిత మున్సిపల్ కమీషనర్లు, ఎంపిడివోలు, తహాశీల్థార్లతో వర్చువల్గా మాట్లాడి సమస్యను వారికి వివరించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్పందనలో రెవెన్యూ, పోలీస్ శాఖలకు చెందిన ఆర్జీలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. స్పందన ఆర్జీల పరిష్కారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు సమస్యలను పరిశీలించి నిర్ణిత కాల పరిమితిలోగా పరిష్కరించాలన్నారు. సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుని కాలయాపన లేకుండా పరిష్కారం చూపాలన్నారు. స్పందన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం కూడదని, నమోదు అవుతున్న వినతులను సకాలంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
నేటి స్పందనలో 80 వినతులు నమోదు కాగా వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖలో 38, పోలీస్ 9, యంఎయుడి 6, సహకర శాఖ 6, డిఆర్డిఏ 4, పంచాయతీరాజ్ 3, హెల్త్ 3, ఆర్డబ్యుఎస్ 2, ఆర్అండ్బి 1, మార్కెటింగ్ 2, ఏపిఎస్పిడిసిఎల్ 1, సోషల్ వెల్ఫేర్ 1, సర్వే 1, ఇరిగేషన్ 1, విభిన్నప్రతిభావంతుతు 1, బ్యాంకుకు సంబంధించి 1 ఆర్జీలు నమోదయ్యాయని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
స్పందన కార్యక్రమంలో డిఆర్డిఏ పీిడి కె.శ్రీనివాస్, ఐసిడిఎస్ పీడి జి. ఉమాదేవి, డియంహెచ్వో డా. యం సుహాసిని, జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ యం విజయభారతి, జిల్లా విద్య శాఖ అధికారిని సివి రేణుక, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి యం. రుక్మాంగదయ్య, హౌసింగ్ పిడి రజినీ కుమారి, పశుసంవర్థక శాఖ జెడి కె. విద్యాసాగర్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి బాలాజీ కుమార్, డ్వామా పిడి జె. సునీత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News