విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వంలో గుర్తించిన సమస్యాత్మక ప్రదేశాలలో అధికారులతో కలిసి మంగళవారం ఆయన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కండ్రిక, రాజీవ్ నగర్, ఎల్బీఎస్ నగర్ సహా పలు ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. స్థానికులతో మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీనిచ్చారు. రోడ్లపై చేరిన వర్షపు నీరు వెంటనే పోయేవిధంగా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎయిర్ టెక్ మెషీన్ల సాయంతో నీటిని యుద్ధప్రాతిపదికన తోడించాలని ఆదేశించారు. అలాగే సైడ్ డ్రెయిన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని.. చెత్త, సిల్ట్ కారణంగా ఎక్కడా నీరు నిలిచే పరిస్థితి ఉండకూడదన్నారు. వర్షానికి చలి తోడు కావడంతో ప్రజలు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని మల్లాది విష్ణు సూచించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట డీఈ(ఇంజరింగ్) గురునాథం, నాయకులు యరగొర్ల శ్రీరాములు, ఇస్మాయిల్, అలంపూర్ విజయ్, పసుపులేటి యేసు, మోదుగుల గణేష్, రామిరెడ్డి, తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News