Breaking News

తుఫాను బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది-ప్రత్యేక అధికారి శ్యామలా రావు

-తుఫాన్ బాధితులకు పునరావాస కేంద్రాల వసతి ఏర్పాటు చేశాం… సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తుఫాను బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం తిరుపతి జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించబడిన రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలా రావు అన్నారు.

మంగళవారం స్థానిక శ్రీ పద్మావతి అతిథి గృహంలో తిరుపతి జిల్లా తుఫాను ప్రత్యేక అధికారిని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణ రెడ్డి కలిసి జిల్లాలో తుఫాను నేపథ్యంలో తీసుకున్న పలు చర్యలపై వివరించారు.

ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ముఖ్యమంత్రి గారు సూచించిన మేరకు ప్రజలకు ఆపన్న హస్తం అందించాలని తెలిపారు. తాను పర్యటించిన గూడూరు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, తిరుపతి రెవెన్యూ డివిజన్ల లో విద్యుత్, రహదారులు తదితరాల పునరుద్ధరణ తదితర అంశాలపై సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలు ప్రత్యేక అధికారికి వివరించారు. వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ వారి తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మిచౌంగ్ తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించామని ముందుగా ముఖ్యమైన అన్ని శాఖల వారికి సమన్వయ సమావేశం నిర్వహించి తుఫాన్ సన్నద్ధతపై దిశా నిర్దేశం చేశామని తెలిపారు. జిల్లాలో తుఫాను ప్రభావిత డివిజన్లలోని 15 మండలాల పరిధిలో 17 గ్రామాల్లో 17 సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను అందులో తరలించి 1293 మంది తూఫాన్ బాధితులకు ఆహారం, మంచినీరు, పాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నట్లు సహాయ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం, మంచి వసతి తోపాటు బాధితులకు కనీస సౌకర్యాలు కల్పించినట్లు ప్రత్యేక అధికారికి వివరించారు. అలాగే NDRF సిబ్బంది 20 మంది నిరంతరం తూఫాన్ సహాయక చర్యలు లో పాల్గొంటున్నారని, రెవెన్యూ పోలీస్, శానిటేషన్, ఆర్ డబ్ల్యు ఎస్, ఇతర ఇంజనీరింగ్, గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది జిల్లా యంత్రాంగం తూఫాన్ సహాయక చర్యలలో గత ఐదు రోజులుగా నిమగ్నమై ఉన్నారని తెలిపారు. అలాగే తూఫాన్ ప్రభావిత మండలాల్లో రెవెన్యూ డివిజన్, మండల కార్యాలయాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో, జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో అధికారులు ఉంటూ అప్రమత్తంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. 17 గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే విద్యుత్, రోడ్డు రేపేరి పునరుద్ధరణ పనులు ఎప్పటికప్పుడు చేపడుతున్నారని, ప్రజలకు ముందుగానే అన్ని మార్గాల ద్వారా గ్రామ, వార్డు సచివాలయం ద్వారా, వాలంటీర్లు ద్వారా, రెవెన్యూ అధికారులు, మీడియా ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని, ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తూఫాన్ బాధితులకు అండగా ఉంటుందని వారిలో భరోసా కల్పించామని తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించి తూఫాన్ ప్రభావంతో పడిన భారీ వర్షాలు, గాలుల వలన వాటిల్లిన నష్టాల అంచనాలు సంబంధిత అధికారుల నుండి అందిన వెంటనే నివేదికలు సిద్ధం చేస్తామని తెలిపారు.  ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *