Breaking News

కొవ్వూరులో లంక భూములు, ఇళ్ల పట్టాల పంపిణీ మహోత్సవంలో పాల్గొన్న హోంమంత్రి తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు మండలంలో పట్టాల పంపిణీ మహోత్సవంలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో చిడిపి గ్రామానికి చెందిన 97 కుటుంబాలకు లంక భూముల పట్టాల పంపిణీ, ఐ.పంగిడి గ్రామానికి చెందిన 32 కుటుంబాలకు ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని హోంమంత్రి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులతో కాసేపు ముచ్చటించారు. దీర్ఘకాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపిన జగనన్న ప్రభుత్వానికి, హోంమంత్రి తానేటి వనితకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలుపుతూ తమ సంతోషాన్ని పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. లబ్ధిదారులు వారి మనసులో మాటలను, వారి సంతోషాన్ని వ్యక్తం చేయడం జగనన్న పాలన మీద వారి అభిమానాన్ని తెలియజేసిందన్నారు. జగనన్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన వెసులుబాటు వలన ఈ రోజు మొత్తం 129 మందికి లంక భూములు, ఇళ్ల పట్టాల పంపిణీ మహోత్సవాన్ని చేపట్టగలిగామన్నారు. లంక భూముల్లో ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో వారికి సంపూర్ణ హక్కు కల్పించాలని జగనన్న తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం అని తెలిపారు. చిడిపి గ్రామంలో ఉన్న లంక భూములు గతంలో సొసైటీ పరంగా.. పది, పదిహేను మంది కలిసి ఒక సొసైటీగా ఏర్పడి నామమాత్రపు ఫీజు చెల్లిస్తే ప్రభుత్వం తరఫున లీజుకి ఇచ్చేవాళ్లని గుర్తుచేశారు. అలాంటి లంక భూమిని ఒక్కొక్కరికి 65 సెంట్లు చొప్పున 97 మందికి సంపూర్ణ హక్కులు కల్పిస్తూ హక్కు పత్రం అందజేయడం గొప్ప విషయమన్నారు. ఇప్పడు సొంతంగా వ్యవసాయాలు చేసుకోవడానికి అవకాశం కలగడంతో అక్కడ వ్యవసాయపరంగా లబ్ధి చేకూరుతుందని, మీకు నచ్చిన పంటను మీరు పండించుకునే అవకాశం కలుగుతుందన్నారు. గతంలో లంక భూముల మీద కొన్ని కేసులు కూడా నడిచేవని, కొన్ని సందర్బాల్లో అధికారులు అడ్డుకునేవారన్నాను. అలాంటి సమస్యలు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా, స్వతంత్రంగా నా భూమి అని మీరు గర్వపడే విధంగా ప్రభుత్వం అందరికీ హక్కు పత్రాన్ని కల్పించడం జరిగిందన్నారు. అలాగే పంగిడి గ్రామంలో తాను గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్నినిర్వహించిన సమయంలో కొంతమంది మహిళలు ఇంటి స్థలాలకు సంబంధించిన సమస్యలను చెప్పారని, అక్కడున్న 32 మంది కుటుంబాలకు ఇంటి మీద శాశ్వతమైన హక్కు కలిగి వారి అవసరాల నిమిత్తం బ్యాంకులో పెట్టుకుని ఏదైనా రుణాలు పొందే విధంగా అవకాశం కల్పించామన్నారు. అలాగే కొవ్వూరు టౌన్ లో ఇందిరమ్మ కాలనీలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి హాయాంలో వాళ్లకి స్థలాలు ఇవ్వడం జరిగిందని, ఎన్ని ప్రభుత్వాలు మారినా కాలనీవాసులకు సరైన ఆధారంగా పట్టాలు లేకపోతే.. జగన్ మోహన్ రెడ్డి హాయాంలో ఇందిరమ్మ కాలనీలో 1200 మందికి ఇళ్ల పట్టాలు అందజేయడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇళ్లు లేని ప్రతి పేదవానికి ఇంటి స్థలం ఇచ్చామన్నారు. మ్యానిఫెస్టోలో 25 లక్షల ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చి.. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ ఇవ్వాలని 32 లక్షల మందికి ఇంటి పట్టాలు అందజేశామన్నారు. అర్బన్ ప్రాంతాల్లో సెంటు స్థలం, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర స్థలం చొప్పున మార్కెట్ లో ఎంత ధర ఉన్నా కూడా ఖర్చు చేసి వాటిని అభివృద్ధి చేసి ప్రతి పేదవానికి ఇంటి స్థలం అందజేశామన్నారు. ప్రతి ఒక్క కష్టాన్ని కూడా విని ఆ కష్టానికి వెంటనే పరిష్కారం చూపించే మనసున్న మారాజు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అని హోంమంత్రి కొనియాడారు. బోయే రోజుల్లో కూడా మరిన్ని సంక్షేమ పథకాలు, సుపరిపాలన రావాలంటే మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రిని కావాలని ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా, తనను కొవ్వూరు ఎమ్మేల్యేగా ఆశీర్వదించాలని హోంమంత్రి తానేటి వనిత ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో ఐ.పంగిడి, చిడిపి గ్రామాల ప్రజాప్రతినిధులు, నియోజవర్గ నాయకులు, కొవ్వూరు ఆర్డీవో, ఎమ్మార్వో, ఇతర అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *