విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, వాసవీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గొల్లపూడిలోని పద్మావతి కల్యాణమండపంలో ఆర్యవైశ్య వైభవం పేరుతో ఆదివారం నిర్వహించిన కార్తీక వనసమారాధన వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామి కల్యాణం, అనంతరం సామూహిక శ్రీసత్య నారాయణ స్వామివారి వ్రతాలను ఆర్యవైశ్యులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రపంచ వాసవీ మహాపీఠాధీశ్వరులు శ్రీధర్ స్వామీజీ మాట్లాడుతూ సామాజిక సేవలకు ఆర్యవైశ్యులు ప్రతీకలుగా నిలుస్తున్నారన్నారు. ఆయన ప్రవచిస్తూ భక్తులను అనుగ్రహించడం కోసం అమ్మ వారు అనేక రూపాల్లో అవతరిస్తుందని, వాటిల్లో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అవతారం ఒకటని చెప్పారు. ఆర్యవైశ్య నాయకులు పారేపల్లి రాకేష్ మాట్లాడుతూ విజయవాడలోని పున్నమిఘాట్ సమీపంలో తలపెట్టిన ఈ కార్యక్రమానికి కొందరు అనేక అడ్డంకులు సృష్టించి, మా మీద అసత్య ప్రచారం చేసి బురద చల్లాలని చూసినా మామీద నమ్మకంతో ఆర్యవైశ్య సోదర సోదరీమణులు మేమున్నామని చెప్పి ఐక్యతతో అందరూ నడిపించారని దీని విజయానికి అందరూ సమిష్టి కృషి ఐక్యతకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమం విజయానికి సహాయ సహకారాలు అందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. పూజాధికాల తరువాత స్వామివారి అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఏసి మెంబర్ ముత్తా శశిధర్, గుంటూరు జిల్లా అధ్యక్షులు నేరెళ్ల సురేష్, కేశినేని ఫౌండేషన్ చైర్మన్ కేశినేని చిన్ని మరియు విజయవాడ నగర అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్, ప్రముఖ న్యాయవాది పిల్ల శ్రీనివాస్, నగర ఉపాధ్యక్షులు వెన్నా శివశంకర్, నగర కార్యదర్శి గొట్టా సాయికుమార్ 39వ డివిజన్ అధ్యక్షులు ఏరూరి సాయి శరత్, ఆర్యవైశ్య నాయకులు వీవీకే నరసింహారావు, పారేపల్లి రాకేజ్, కొణిజేటి రమేష్, దర్శి వాసు, నూకల నాగేశ్వ రరావు, జాలాది వెంకటేశ్వరరావు, బొగ్గవరపు సత్యనారాయణ, తుమ్మలపెంట శ్రీనివాసులు, శేగు వెంకటేశ్వర్లు, చుండూరు ఉమామహేశ్వరరావు, కేవీఎల్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News