-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-30 వ డివిజన్ 251 వ సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పారదర్శకత, అధికారులలో జవాబుదారీతనాన్ని పెంచారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 30 వ డివిజన్ 251 వ వార్డు సచివాలయ పరిధిలో శుక్రవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. జీవీఆర్ నగర్లో విస్తృతంగా పర్యటించి.. 185 గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరును నేరుగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో నగదు వేయడం ఎంతో సంతోషంగా ఉందని లబ్ధిదారులు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నవరత్నాల పథకాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు మల్లాది విష్ణు చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా నగదు బదిలీ చేయడం వల్ల అర్హత ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రతిపక్షాలది ఏడుపే ఏడుపు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన చూసి ప్రతిపక్షాల పరిస్థితి ఏడుపే ఏడుపుగా మారిపోయిందని మల్లాది విష్ణు విమర్శించారు. ఆ ఫ్రస్టేషన్లో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని స్థితిలో విపక్షాలు ఉన్నాయని విమర్శించారు. ముఖ్యంగా తెలుగుదేశంతో పదేళ్ల పాటు కలిసి ఉంటామని పవన్ కళ్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వీరి ఐదేళ్ల కలయిక రాష్ట్రాన్ని 50 ఏళ్లు వెనక్కి నెట్టిందని ఆరోపించారు. పైగా విడిపోయాక నారా లోకేష్ ని పవన్ కళ్యాణ్ తిట్టినన్ని తిట్లు ఎవరూ తిట్టలేదని గుర్తుచేశారు. మరలా ఏం ముఖం పెట్టుకుని ప్రజలను మభ్యపెడుతున్నారని ప్రశ్నించారు. ఈ రాష్ట్రానికి తెలుగుదేశం తీరని అన్యాయం చేసిందని.. అందులో జనసేన పాత్ర కూడా ఉందని విమర్శించారు. మరోవైపు ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్ లను అందజేస్తుంటే.. వాటిపై కూడా విషప్రచారం చేయడం సరికాదని మల్లాది విష్ణు మండిపడ్డారు. అలాగే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం రోజున సత్యనారాయణపురం గాయత్రీ కన్వెన్షన్ హాల్ నుంచి కండ్రిక వరకు నిర్వహించనున్న బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు మార్తి చంద్రమౌళి, అక్బర్, పవన్ కుమార్ రెడ్డి, సుబ్బారెడ్డి, నారాయణ రెడ్డి, డి.దుర్గారావు, సామంతకూరి దుర్గారావు, ఎస్.రామకృష్ణ, నవాబ్, తుంపాల వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News