తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరజీవి పొట్టి శ్రీరాములు వారి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం ఆదర్శనీయం అని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస రావు అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు అమరజీవి పొట్టి శ్రీరాములు వారి వర్ధంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లీగల్ సెల్ వారు హాజరై పొట్టి శ్రీరాములు వారి పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగఫలమే మన తెలుగు రాష్ట్రం అని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం, స్ఫూర్తి దాయకం అని అన్నారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి భాస్కర్ రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, కలెక్టరేట్ ఏఓ జయరాములు, బిసి సంక్షేమ శాఖ అధికారులు చంద్ర శేఖర్, జ్యోత్స్న, బిసి హాస్టల్ వెల్ఫేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News