Breaking News

6వ పిల్లల పండుగ సంబరాల నిర్వహణ

-19, 20, 21 తేదీలలో అమరావతి బాలోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి బాలోత్సవం 6వ పిల్లల పండగకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ నెల 19,20,21 తేదీలలో విజయవాడ సిద్ధార్ధ కళాశాల ఆడిటోరియం ప్రాంగణంలో పిల్లల పండగ సంబరాలు జరుగనున్నాయి. ఎన్‌టిఆర్‌, కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల పరిధిలోని 175 స్కూల్సు నుండి షుమారుగా 10 వేల మంది విద్యార్ధిని, విద్యార్ధులు బాలోత్సవంలో పాల్గొనబోతున్నారు. 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి సంపత్‌కుమార్‌ పిల్లల పండగను ప్రారంభిస్తారు. ముఖ్యఅతిధిగా ఎంఎల్‌సి కె యస్‌ లక్ష్మణరావు, విశిష్ట అతిధులుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మైన్స్‌ Ê జియాలజి డైరక్టర్‌ వి జి వెంకటరెడ్డి, ఎన్టీఆర్‌ జిల్లా డిఇఓ సి వి రేణుక, ఎస్‌బిఐ డిజిఎం మనీష్‌కుమార్‌ సింగ్‌, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ మిడ్‌టౌన్‌ అధ్యక్షులు సాధు వి ఆర్‌ ప్రసాద్‌ లు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఆదివారం సిద్ధార్ధ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో బాలోత్సవం గౌరవాధ్యక్షులు చలవాది మల్లికార్జునరావు మాట్లాడుతూ భారీ స్థాయిలో బాలోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. ఈ బాలోత్సవంలో 39 ఎకడమిక్‌, 16 కల్చరల్‌ మొత్తంగా 55 ఈవెంట్స్‌లో పోటీల నిర్వహణకు కల్చరల్‌, అకడమిక్‌ సబ్‌ కమిటీలుగా ఏర్పడి ఆర్గనైజర్లు, న్యాయనిర్ణేతలు కార్యక్రమ నిర్వహణకు సిధ్దంగా వున్నారు. బాలోత్సవం జరిగే ప్రధాన వేదికకు భారత దేశం గర్వించే వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్‌ ఎం.ఎస్‌. స్వామినాధన్‌ వేదికగా నామకరణం చేశామన్నారు. కల్చరల్‌ పోటీలు జరిగే వేదికలకు కళా తపస్వి కె విశ్వనాధ్‌, ప్రజా వాగ్గేయకారుడు గద్దర్‌, ప్రముఖ గాయని వాణి జయరాం, బాలబంధు వెలగా వెంకటప్పయ్య వేదికలుగా నిర్ణయించామన్నారు. అకడమిక్‌ పోటీలు జరిగే ప్రాంగణాలకు విద్యావేత్త, ఎంఎల్‌సి షేక్‌ సాబ్జి, ఆచార్య కేతు విశ్వనాధరెడ్డి, సాహితీవేత్త ఆవంత్స సోమసుందర్‌ పేర్లు పెట్టామని చలవాది చెప్పారు.
బాలోత్సవం ప్రధాన కార్యదర్శి ఆర్‌ కొండలరావు మాట్లాడుతూ ఏకకాలంలో కళాశాల ప్రాంగణంలో 9 చోట్ల పోటీలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. పోటీలకు వచ్చే విద్యార్ధులు, వారితో పాటు వచ్చే స్కూలు ఉపాధ్యాయులు, తల్లి దండ్రులు, నిర్వాహకులందరికీ 3 రోజులు మంచి భోజనం పెట్టేందుకు ఫుడ్‌ కమిటీని సన్నద్ధం చేశామన్నారు.
21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహుమతి ప్రధానోత్సవ సభలో ముఖ్య అతిధిగా ఎం డి ఇంతియాజ్‌ ఐఎఎస్‌, ప్రత్యేక అతిధిగా బాలోత్సవ వ్యవస్ధాపకులు డా॥ వాసిరెడ్డి రమేష్‌బాబు, కృష్ణా మిల్క్‌ యూనియన్‌ అధ్యక్షులు చలసాని ఆంజనేయులు, కెనరా బాంక్‌ జనరల్‌ మేనేజర్‌ పి రవివర్మ, పారిశ్రామికవేత్త బాయన వెంకటరావు, లారీ ఓనర్స్‌ ఫౌండేషన్‌ అధ్యక్షులు కె వి రామారావు పాల్గొంటారన్నారు. బాలోత్సవం అధ్యక్షులు ఎస్‌ పి రామరాజు మాట్లాడుతూ బొమ్మలు గీస్తూ, ఉపన్యాసాలు చెపుతూ, మట్టితో బొమ్మలు చేస్తూ, వ్యాసాలు రాస్తూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ, డ్రామాలు వేస్తూ, విచిత్ర వేషధారణలతో జరుగు 3 రోజుల పిల్లల జాతరకు నగరంలోని ప్రజలను, బాలల ప్రేమికులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నామని, 6వ పిల్లల పండుగ నిర్వహణలో అందరూ భాగస్వాములై సహకరించాలని కోరుతున్నామన్నారు. ఖనిజాభివృద్ధి సంస్థ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ రాజా రమేష్‌, బాలోత్సవ కమిటీ సభ్యులు ఎన్‌ విద్యాకన్నా, వెన్నా వల్లభరావు, యార్లగడ్డ సుబ్బారావు, వి సాంబిరెడ్డి, రావెళ్ల శ్రీనివాసరావు, కె వెంకట్‌, సిహెచ్‌ ఎల్‌ నరశింహరావు, పి ఐజాక్‌ న్యూటన్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *