Breaking News

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అక్షర క్రమంలోనే కాకుండా అక్షరాస్యతలోనూ ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానాన నిలపడమే లక్ష్యంగా విద్యారంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 23వ డివిజన్ గవర్నర్ పేటలోని సీవీఆర్ స్కూల్ నందు 31 మంది 8 వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావుతో కలిసి గురువారం ఆయన ట్యాబ్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా “థ్యాంక్యూ జగన్ మామ” అంటూ చిన్నారులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. చదువుతోనే పేద‌రికాన్ని నిర్మూలించ‌గ‌ల‌మ‌ని బ‌లంగా న‌మ్మే వ్యక్తి సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అని పేర్కొన్నారు. క‌నుక‌నే రాష్ట్రంలో విద్యను అభ్యసించే వారి శాతాన్ని పెంచేందుకు అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నార‌న్నారు. ప్రాథ‌మిక విద్య నుంచి విదేశీ విద్య వ‌ర‌కు అన్ని ద‌శ‌ల‌లోనూ చేయూత‌నందిస్తూ.. విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తున్నట్లు వెల్లడించారు. నూతన విద్యా విధానం కోసం రూ. 71 వేల కోట్లు ఖర్చు చేయడం దేశంలోనే ప్రప్రథమని అన్నారు. బైజూస్ యాప్ తో కూడిన ట్యాబ్ ను కొనుగోలు చేయాలంటే బహిరంగ మార్కెట్ లో రూ. 33 వేలు చెల్లించాలన్నారు. కానీ పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదన్న ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్లో మొత్తం 1,569 మంది విద్యార్థులకు ట్యాబ్ లను ఉచితంగా అందజేస్తుండగా.. వీరిలో 738 మంది బాలురు, 831 మంది బాలికలు ఉన్నట్లు వెల్లడించారు. జిల్లాలోనే ఈ సంఖ్య అత్యధికమని చెప్పుకొచ్చారు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పే పాఠాలు మరింత సులువుగా అర్థమయ్యేలా ఈ ట్యాబ్ లు దోహదపడతాయని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఇప్పటికే అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద వంటి పథకాల ద్వారా విద్యకు సీఎం వైఎస్ జగన్ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలు చక్కటి వాతావరణాన్ని సంతరించుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. మంచినీటి సదుపాయం, మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయం, లైట్లు, ఫ్యాన్లు, బెంచీలు, ఫర్నీచర్, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, పెయింటింగ్, ఇంగ్లీష్‌ ల్యాబ్స్, ప్రహరీ గోడలతో అధునాతనంగా ముస్తాబు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్క సీవీఆర్ స్కూల్ లోనే నాడు – నేడు ద్వారా అక్షరాల రూ. 68.54 లక్షల నిధులు ఖర్చు చేసినట్లు వివరించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సదరన్ ఇండియా సైన్స్ ఫేర్ – 2024 బ్రోచర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఈఓ సి. వి. రేణుక, జోనల్ కమిషనర్ మాల్యాద్రి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, నాయకులు ఒగ్గు విక్కీ, వెన్నం రత్నారావు, చల్లా సుధాకర్, యర్రంశెట్టి అంజిబాబు, పసుమర్తి రాజేష్, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *