విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా అధికార పక్షము మరియు ప్రధాన ప్రతిపక్షేతర తృతీయ ప్రత్యామ్నాయ రాజకీయ ఫ్రంట్ ఆవిర్భావము ఆవశ్యకం ఉన్నదని ఎస్. దశరథరామిరెడ్డి అన్నారు. ఆల్ ఇండియా జైహింద్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.దశరదరామిరెడ్డి పిలుపు నిచ్చిన యునైటెడ్ ఫ్రంట్ ఆవిర్భావ సభ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని 71 రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలతో ఒక యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి 2024 సాధారణ ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్ధులను అసెంబ్లీ మరియు పార్లమెంట్‌కు పోటీకి నిలబెట్టాలనే ఆలోచనతో ఈ సభ ఏర్పాటు చేయడమయినదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఒక్క విభజన హామీ కూడా కేంద్రం అమలు చేయలేదు.అన్నిటికంటే ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హెూదా విషయంలో కేంద్రం వాగ్ధాన భంగానికి ఒడికట్టినది. ఎయిమ్స్ ఆసుపత్రి, ఐ.ఐ.టి.లు, ట్రైబల్ యూనివర్శిటీ, విశాఖరైల్వేజోన్, రాయలసీమ మరియు ఉత్తరాంధ్రాభివృద్ధికి ప్రత్యేక నిధులు మొ|| విషయాల ఊసే ఎత్తడములేదు. పాలకపక్షము, ప్రధాన ప్రతిపక్షముల వారికి భజన చేస్తున్న పార్టీలు ఈ విభజన హామీలను గూర్చి పట్టించుకోవడంలేదు. వెరసి నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోతున్నారు.కేవలం గౌ॥ ప్రధానిశ్రీ నరేంద్రమోడి గారి భయముతో వారు ఈ విషయాల జోలికి వెళ్లడములేదు. ఈ కారణాల దృష్ట్యా అన్ని పార్టీలను ముఖ్యంగా రాష్ట్రంలోని 71 రిజిస్టర్డ్ పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఈ అంశాలు ప్రధాన అజెండాగా వచ్చే 2024 సాధారణ ఎన్నికల్లో ఫ్రంట్ అభ్యర్ధులను పోటీకి నిలబెట్టే తలంపుతో అన్ని పార్టీల నాయకులతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు చింతా రాజశేఖర్, నవతరం పార్టీ నాయకులు రావు సుబ్రమణ్యం, రెల్లి సంఘ నాయకులు తుపాకుల రాములమ్మ ,మాడుగుల వేణు, జనసేన పార్టీ నాయకులు సోము గోవింద్, ఆల్ ఇండియా జైహింద్ పార్టీ నాయకులు అంబటి నాగమల్లేశ్వరరావు, ఎర్రంశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News