విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతి నగర్ ప్రజలకు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని తూర్పు నియోజకవర్గ వైసిపి ఇంచార్జీ దేవినేని అవినాష్ హమి ఇచ్చారు..సీఎం జగన్ సహాయంతో నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ది పనులు జరుగుతున్నాయి అని చెప్పారు. భారతీ నగర్ ఐదవ లైన్ లోనీ కడియాల శివరామ కృష్ణయ్య పార్క్ దాదాపు 20లక్షల రూపాయలతో అభివృద్ది పనులకు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్,వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు,నగర అధ్యక్షులు బొప్పన భావ కుమార్ తో కలిసి భూమి పూజ చేశారు.. ఈ సందర్బంగా దేవినేని అవినాష్ మాట్లాడుతు నాల్గోవ డివిజన్ భారతి నగర్ ఐదవ లైన్ లో పార్క్ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయటం ఆనందంగా ఉందన్నారు.. ఈ కాలనితో దేవినేని నెహ్రుకి ఏంతో మంచి సంబంధం ఉండేదని అన్నారు.ఒక పని మీద ఎవరైనా వస్తె ఆ పని ఎలాంటిది అయిన చేసి పంపించే మనస్తత్వం నెహ్రు ది అని చెప్పారు.. ఈ కాలని వాసులుకి ఏ అవసరం వచ్చినా తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.. పార్క్ అభివృద్ది కి ఇప్పటికే ఇరవై లక్షలు ఇచ్చామని ఇంకా ఎన్ని నిధులు అవసరమైన తెచ్చేందుకు తాను సిద్ధమని చెప్పారు..సీఎం జగన్ సహాయంతో నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
అనంతరం వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు మాట్లాడుతు కాలని వాసులకు మంచి చేయాలనే ఉద్దేశంతో దేవినేని నెహ్రూ హయాం నుంచి ఏంతో చేశామని గుర్తు చేశారు..అందరి మన్ననలు పొందుతూ ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి మంత్రిగా పని చేసిన ఘనత నెహ్రు ది అని చెప్పారు..ఇప్పటికే తూర్పు నియోజకవర్గo లో 450 కోట్ల అభివృద్ది పనులు దేవినేని అవినాష్ చేశారని అన్నారు.. ఈ పార్క్ గురించి చెప్పిన వెంటనే 20 లక్షలు కేటాయించే విధంగా కృషి చేసారని చెప్పారు..ప్రజలు అందరు అవినాష్ నీ ఆశీర్వదించి ఎమ్మెల్యే గా గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాలని ప్రెసిడెంట్ సాయి బాబు,, ఎంసీ దాస్,, లక్ష్మణ రావు,,రత్న బాబు,,లక్ష్మీ,,లీల,పద్మజ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News