Breaking News

దేశానికే దిక్చుచిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా విధానం: దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం దేశానికే ఆదర్శంగా నిలిచింది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.గురువారం 14వ డివిజన్ గోవిందరాజుల హై స్కూల్ నందు తూర్పు నియోజకవర్గం సంబందించి 1310 విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ 8వ తరగతి విద్యార్థులకు బైజుస్ కంటెట్ లోడ్ చేసిన ట్యాబ్ లను అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ దేశానికే దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానం ఉందని,జగనన్న ప్రభుత్వం ఈ 55 నెలల కాలంలోనే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది అని అన్నారు.8 తరగతి విద్యార్థులు పై తరగతులకు వెళ్ళినప్పుడు కూడా ఉపయోగపడేలా,8 తరగతితో పాటు 9, 10 తరగతుల సిలబస్ కూడా కవర్ అయ్యేలా బైజూస్ కంటెంట్ లోడ్ చేసి ట్యాబ్ లు అందజేసినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో 4.34 లక్షల మంది విద్యార్థులకు రూ.620 కోట్ల వ్యయంతో ఉచితంగా ట్యాబులు పంపిణీ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దే అని కొనియాడారు.డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ.. మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దుతూ ప్రభుత్వ పాఠశాలల్లో 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, 45 వేల స్మార్ట్ టీవీలు ఏర్పాటుచేసి ప్రతి తరగతి గదిలో ఆఫ్ లైన్, ఆన్ లైన్ క్లాసులతో విద్యా బోధన చేస్తున్నారని అన్నారు.పేద విద్యార్థులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సొంత మామయ్య మాదిరిగానే భావించి వారిని ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహిస్తూ కానుకలు అందిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రేణుక,14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య,డివిజన్ ప్రెసిడెంట్ శెటికం దుర్గాప్రసాద్,క్లస్టర్ ఇంచార్జ్ సన్నీ,వైసీపీ నాయకులు మరిదు ఉమా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *