Breaking News

స్మార్ట్ సిటీగా కడప నగరం..!

– రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
-నగరంలో అధునాతనంగా నిర్మించిన అంబేద్కర్ సర్కిల్ – వై జంక్షన్ రోడ్డు, కోటిరెడ్డి సర్కిళ్ళకు ప్రారంభోత్సవాలు

కడప, నేటి పత్రిక ప్రజావార్త :
కడప నగరాన్ని స్మార్ట్ సిటీగా చూడాలన్న నగర ప్రజల ఆకాంక్ష నెరవేరిందని.. కడపకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నామని.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

శనివారం మధ్యాహ్నం కడప నగరంలో అత్యాధునిక హంగులతో రూ.56.70 కోట్ల ప్రభుత్వ నిధులతో నిర్మించిన అంబేద్కర్ సర్కిల్ – వై జంక్షన్ రోడ్డును, 15వ ఆర్థిక సంఘ మరియు “కుడా” సహకారంతో రూ.1.50 కోట్లతో నిర్మించిన కోటిరెడ్డి సర్కిల్ లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కడప నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన ఆటవిడుపుకు, ఆరోగ్యానికి సరికొత్త హంగులు, అధునాతన వసతులతో రూపుదిద్దుకున్న రాజీవ్ పార్కు, రాజీవ్ మార్గ్ లతో పాటు పలు మున్సిపల్ పార్కులు, రహదార్ల, పార్కింగ్ ప్లేసులు, ఫుట్ పాత్ లు, డివైడర్లలో పచ్చదనాన్ని నగరానికే తలమానికంగా తీర్చిదిద్దడం జరుగుతోందన్నారు. కడప నగరాభివృద్ధిలో భాగంగా పారిశుద్ద్యం, స్వచ్ఛతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి కడపను ఆరోగ్యకరమైన సుందర నగరంగా తీర్చిదిద్దడంలో మాట నిలబెట్టుకోవడం జరిగిందన్నారు. కడప నగరం అభివృద్ధికి పెట్టిన ప్రతిపాదనలు అన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు కూడా చేయడం సంతోషించదగ్గ విషయం అన్నారు. ఇప్పటికే దాదాపు అన్ని నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగిందని, మరికొన్ని పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటికే.. నగరానికి తలమానికంగా పలు ప్రధాన రహదారులకు విస్తరణ పనులు చేపట్టి.. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కడపను అభివృద్ధి చేసి చూపించామన్నారు.

కాగా… అంబేద్కర్ సర్కిల్ నుండి వై-జంక్షన్ వరకు నిర్మించిన రహదారి నిర్వహణలోకి తీసుకురావడంతో కడప నగరంలో గత కొన్నేళ్లుగా నగర ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ట్రాఫిక్ సమస్యకు శాశ్విత పరిష్కారం లభించింది. ఆర్టీసీ బస్టాండు నుండి వై జంక్షన్ ద్వారా తిరుపతి బైపాస్ రోడ్డును, ఇటు అప్సర సర్కిల్ ను కలిపే.. ఈ ప్రధాన రోడ్డును విస్తరించడంలో భాగంగా పలు నిర్మాణాలను తొలగించి పరిహారం అందజేయడంలో, వాహనాల రాకపోకలకు అనువుగా, అత్యంత సుందరంగా తీర్చి దిద్దడంలో కడప నగర పాలక సంస్థ కమీషనర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్ అత్యంత కీలక పాత్ర పోషించారు.

అలాగే.. నగరంలోని మరో ప్రధాన కూడలి కోటిరెడ్డి సర్కిల్ ను అధునాతన హంగులతో పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. సరికొత్త ఇంజనీరింగ్ డిజైన్ తో వాటర్ ఫౌంటెన్, పచ్చటి పూల మొక్కల మధ్యలో కడప చరిత్రలో చెరగని పేజీగా నిలిచిన దివంగత కోటిరెడ్డి గారి విగ్రహాన్ని ప్రతిష్టించి కడప నగరానికే అత్యంత వన్నె తీసుకొచ్చింది కడప నగర పాలక సంస్థ.

దీంతోపాటు.. కడప నగరానికి నడిబొడ్డున ఉన్న 7 రోడ్ల కూడలి అత్యంత ప్రాధాన్యతను సొంతం చేసుకుంది. పాత బస్టాండు నుండి నలుదిక్కులు వెళ్లే బస్సులతో పాటు వాణిజ్య అవసరాల కోసం వెళ్లే ప్రతి ఒక్కరూ.. ఇదే కూడలి నుండి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఏడు రోడ్ల కూడలి అత్యంత రద్దీగా ఉండేది. ప్రస్తుతం ఈ కూడలిని ఆధునీకరించి, ప్రజలకు సౌకర్యవంతంగాను, నగరానికి వన్నె తెచ్చే విధంగాను, నగరానికి వచ్చే బయటి వ్యక్తులను ఆకట్టుకునేలా అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇకపోతే.. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంలో భాగంగా నగరాన్ని అత్యంత ప్రధాన్యతతో సుందరీకరించడంలో జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ప్రత్యేక శ్రద్ధ వహించడం అభినందనీయం.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో.. ముఖ్యమంత్రితో పాటు జిల్లా ఇంఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, కడప నగర మేయర్ కె.సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రా రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి, ఎపిఎస్ ఆర్టీసీ చైర్మన్ ఏ. మల్లికార్జున రెడ్డి, జేసీ గణేష్ కుమార్, కడప నగర కమీషనర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *