Breaking News

తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన శుభం భన్సల్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గా నేటి శనివారం శుభం భన్సల్ గారు జిల్లా కలెక్టరేట్ నందు బాధ్యతలు స్వీకరించారు. 2020 బ్యాచ్ ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన వీరు తొలి పోస్టింగ్ రంపచోడవరం సబ్ కలెక్టర్ గా విధులు చేపట్టి పలు రకాల ప్రజా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి జిల్లాలో జెసి గా పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను సమర్థవంతంగా అమలు చేయడానికి, ఎన్నికలు పారదర్శకంగా సజావుగా జరుపుటలో తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పలు రెవెన్యూ అంశాలపై జెసి గారు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఎస్డిసి శ్రీనివాసరావు, పలువురు జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఎఓ జయరాములు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు నూతన జెసి గారికి శుభాకాంక్షలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *