ఈనెల 26నుండి ఆడుదాం ఆంధ్ర క్రీడలు : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 26 నుండి 47 రోజుల పాటు జిల్లాలో 691 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఆడుదాం ఆంద్ర పండుగ వాతవరణంలో నిర్వహించేలా అందుకుతగ్గ ఏర్పాట్లు పూర్తియ్యాయని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో “ఆడుదాం ఆంధ్ర” క్రీడల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సాంప్రదాయ క్రీడల ఆటవిడుపుకు క్రీడాకారులు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

క్రికెట్, వాలీబాల్, కుడ్డీ, జో-లో, బ్యాడ్మింటన్ పోటీలకు సంబంధించి జిల్లాలో మొత్తం 1,53,423 మంది క్రీడాకారులు పోటీలో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నారని, అలాగే క్రీడాభిమానులు కూదా 15150 మంది నమోదు చేసుకున్నారు. జిల్లాలో మొత్తం 500 కు పైగా క్రీడల నిర్వహణకు మైదానాలు గుర్తించామని క్రీడాకారులు అవసరమైన సౌకర్యాలు, వసతులు కల్పించేందుకు అన్ని శాఖాధికారులు నిమగ్నమయ్యారని తెలిపారు.

జిల్లా కేంద్రంలో ప్రారంభోత్సవానికి నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ వేదికగా నిర్వహించనున్నామని ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి మంత్రి, పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొననున్నారని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *