-పార్ట్ టైం లెక్చరర్స్-నాన్ టీచింగ్ సిబ్బందికి కనీస వేతనం ఇవ్వాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జీవో నెంబర్ 328 ప్రకారం పార్ట్ టైం లెక్చరర్ గా, నాన్ టీచింగ్ సిబ్బందిగా పనిచేస్తున్నామని ప్రస్తుత ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలని ముఖ్యంగా కనీసం వేతనం ఇచ్చి, జీఓ 35ను రద్దు చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ ఎయిడెడ్ కాలేజెస్ టెంపరరీ/పార్ట్ టైం లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆరిగి జోషిరావు డిమాండ్ చేశారు. బుధవారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము గత 15 సం,లుగా క్లియర్ ఆగనిస్ట్ పోస్టులలో జీవో నెంబర్ 328 ప్రకారం పార్ట్ టైం లెక్చరర్స్, నాన్ టీచింగ్ సిబ్బంది గా పనిచేస్తున్నామన్నారు. జీవో నెంబర్ 35ను 2005లో తీసుకురావటం ఎయిడెడ్ పోస్టు నిలిపివేశారు. దాంతో మేనేజ్మెంట్ తమను పార్ట్ టైం లెక్చరర్స్, నాన్ టీచింగ్ సిబ్బందిగా నియమించుకొని రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నాము. ఏపీ ఎయిడెడ్ కాలేజీల్లో చదివే ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీ, ఓసీలలోని, వెనుకబడిన విద్యార్థులు ఈ ఎయిడెడ్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. ఎందరో విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు. ఐఏఎస్, ఐపిఎస్ గా ఎంపిక అయ్యారని అయితే విద్యను బోధించిన తాము మాత్రం జీవితాలు దుర్భరంగాను, దయనీయస్థితిలో ఉన్నాయన్నారు. 2018 జూలై 25న ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి సమస్యను తెలియజేశామని ఆయన సానుకూలంగా స్పందించి ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి రాగానే సీఎంను కలవగా పర్సనల్ సెక్రటరీని పిలిచి డిగ్రీ కాలేజీలు పనిచేసే అధ్యాపకులకి, జూనియర్ కాలేజీలు పనిచేసే అధ్యాపకులకు, నాన్ టీచింగ్ సిబ్బందికి (ఎం.టి.ఎస్) మినిమం టైం స్కేల్ అమలు చేయమని ఆదేశించడం జరిగిందని అన్నారు. కాని ఇంతవరకు ఆ హామీ అమలు కాలేదన్నారు. దాంతో ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించటం జరిగిందన్నారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందన్నారు. ఇప్పటికైన తక్షణం తమకు కోర్టు తీర్పు ప్రకారం కనీసం వేతనం, జీఓ 35 ను రద్దు చెయ్యాలని కోరుతున్నామన్నారు. దానిలో భాగంగా గురువారం విజయవాడ ధర్నాచౌక్ వద్ద నిరసన చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్ బి. రాజా రామ్, నాన్ టీచింగ్ స్టాప్ సిహెచ్ మురళి కృష్ణ, ఎం.నాగేశ్వరరావు, బి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News