విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పర్యటించినప్పుడు ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను 95 శాతం పైగా పరిష్కారం అయ్యాయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం 6వ డివిజన్ నందు పార్టీ నాయకులతో కలిసి అప్పలనాయుడు వీధి, మెట్రో ఎదురు కొండ ప్రాంతంలో గడప గడపకి వెళ్లి ఈ నాలుగున్నర ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో 4 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో ఈ డివిజన్లో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొండంచున ఉన్న చివరింటి ఇంటి వరకు వేసిన మెట్లు మార్గాలు, సైడ్ డ్రైనేజ్ నిర్మాణాలతో చాలా సంతోషంగా జీవిస్తున్నామని ప్రజలు వారి సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. పెన్షన్లు కోసం కిందవరకు దిగి కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా నేరుగా ఇంటి వద్దకే తెచ్చి ఇవ్వడమే కాకుండా ఈ నెల నుండి పెన్షన్ పెంచి 3000 రూపాయలు ఇస్తూ ఇంటి పెద్ద కొడుకు లా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారు అని తెలిపారు. ఒకపక్క ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేపడుతూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుంటే కేవలం టీడీపీ పార్టీకి మేలు చేయడం కోసం ఈనాడు పత్రిక పత్రిక విలువలకు తిలోదకాలు ఇచ్చి విష ప్రచారం చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. అంత పేరున్న పత్రిక దిగజారిపోయి టీడీపీ కరపత్రిక గా మరి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు అని ఎద్దేవా చేశారు.2024 లో మరలా అధికారంలోకి వచ్చే వైస్సార్సీపీ ప్రభుత్వం లో ఈ డివిజన్ లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను మీ అవినాష్ ఆన్న హామీ పేరుతో ముద్రించిన మ్యానిఫెస్టో కరపత్రాలు అందించి, మీకు ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆధికారం లోకి వచ్చిన వెంటనే ఈ హామీలు ఆన్ని నెరవేరుస్తామని అవినాష్ భరోసా ఇచ్చారు.ఈ పర్యటన లో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్, రాష్ట్ర తూర్పు కాపు కార్పోరేషన్ డైరెక్టర్ ఇజ్జడా తేజేష్,డివిజన్ అధ్యక్షులు లంకా అబ్బినాయుడు,తాత బాబు,దేవుడు,ఆంజనేయులు,పున్నం రాజు,నరేంద్ర మరియు డివిజన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News