విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారులకు అండగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి అండగా నిలిచిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం 9వ డివిజన్ నందు దాదాపు రూ.20,00,000/- ప్రభుత్వ నిధులతో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అన్ని వసతులతో నూతనంగా నిర్మించిన ఫిష్ మార్కెట్ షేడ్,ఫ్లోర్ టైల్స్,వాటర్ మరియు కరంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని షేడ్ ప్రారంభించి మత్స్యకారులకు అందుబాటులో తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు అపరిశుభ్ర వాతావరణం లో చేపల వ్యాపారులు అనేక ఇబ్బందులు పడుతూ ఇక్కడ వ్యాపారం చేసేవారు అని, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కి ఎన్నిసార్లు మొరపెట్టుకొన్న ఈ ప్రాంత అభివృద్ధి గురుంచి పట్టించుకోలేదు అని స్థానికులు వ్యాపోయేవారు అని అన్నారు. రెండు నెలల క్రితం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పర్యటించినప్పుడు వారు ఇక్కడి సమస్యలు మా దృష్టికి తీసుకురాగా వెంటనే కౌన్సిల్ లో పెట్టించి రూ.20,00,000/- నిధులు మంజూరు చేపించడం జరిగింది అని అన్నారు. నాడు శంకుస్థాపన చేయడమే కాకుండా చేపల వ్యాపారులకు అన్ని వసతులు కల్పిస్తూ పటమటలంక ఫిష్ మార్కెట్ పూర్తి చేసి నేడు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. చేపలు శుభ్రం చేసుకోవడానికి, వ్యర్థ పదార్థాలు తొలగించడనికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మత్స్యకారులకు సామజిక, రాజకీయ గుర్తింపు కల్పించేలా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి జగనన్న తన చిత్తశుద్ధిని నిరూపించారు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు,9వ డివిజన్ ఇంచార్జ్,వల్లూరు ఈశ్వర ప్రసాద్,మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు,14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య,డివిజన్ ప్రెసిడెంట్ గద్దె కళ్యాణ్,ఫిషర్ మెన్ డైరెక్టర్ కాళీ ,వైస్సార్సీపీ నాయకులు లక్ష్మీనారాయణ,కన్నబాబు,వేణు,లంకె బుజ్జి పాల్గొన్నారు
Prajavartha Online Telugu News