Breaking News

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు నిల్వ చేసిన గోదామును తనిఖీ

మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త :
ఈవీఎం గోదాము సురక్షితంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలో భాగంగా గురువారం ఉదయం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో గల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు నిల్వ చేసిన గోదామును తనిఖీ చేశారు. గోదాములోసి సీసీ కెమెరాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు లెక్క ప్రకారం ఉన్నాయా లేదా గోదాము తాళం చెవులు పక్కాగా ఉన్నాయా లేదా లాగ్ బుక్ ప్రకారం అన్ని వస్తువులు పద్ధతి ప్రకారం సరిగా ఉన్నాయా లేదా పోలీసు బందోబస్తు గట్టి పోలీసు బందోబస్తు ఉందా లేదా పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. జెసిబి, రోలర్లతో మట్టిని చదును చేస్తున్న పనులను పిచ్చి మొక్కలను తొలగించే పనులను కలెక్టర్ పరిశీలించారు.పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆర్డిఓ కార్యాలయం నుండి ఈవీఎం గోదాము వరకు సిసి రోడ్డును పక్కాగా నిర్మించాలన్నారు. అంతే కాకుండా కలెక్టరేట్ వచ్చే సందర్శకులకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరుగుదొడ్లను త్వరగా నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట కలెక్టరేట్ ఎన్నికల విభాగం సమన్వయ అధికారి సురేష్ డిటి శ్యామ్, ప్రణాళిక వాస్తు కళా నిలయం విజయవాడ ప్రొఫెసర్ ప్రాజెక్టు మానిటరింగ్ పిడి కె.వి.రావు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *