అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సెంట్రల్

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-ఎమ్మెల్సీ, నగర మేయర్ తో కలిసి రూ. 63.72 లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, భూమిపూజ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవితో కలిసి 61వ డివిజన్ శాంతినగర్లో రూ. 15.35 లక్షల వ్యయంతో నిర్మించిన శానిటరీ ఇన్స్ పెక్టర్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం వాంబేకాలనీలో రూ. 48.37 లక్షల వ్యయంతో ముస్లిం శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఈ ప్రభుత్వం బహుముఖంగా పనిచేస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. తెలుగుదేశం హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కానీ ఈ ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ లేనంతగా ప్రతీ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా వాంబేకాలనీ ఖబరిస్తాన్ లో రూ.48.37 లక్షలతో ప్రహరీ, లెవలింగ్ పనులతో పాటు సీసీ నడక దారిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కూర్చునేందుకు బల్లలు, లైటింగ్, ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తదనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లు మల్లాది విష్ణు చెప్పారు. ముఖ్యంగా 2023 ఏడాది సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి నామ సంవత్సరంగా మిగిలిపోతుందని చెప్పుకొచ్చారు. అలాగే వచ్చే జనవరి నెలను సంక్షేమ మాసంగా ఎమ్మెల్యే అభివర్ణించారు. పింఛన్ల పెంపు, ఆసరా, చేయూతతో పాటు 19న విజయవాడలో చారిత్రాత్మక అంబేడ్కర్ విగ్రహం, మ్యూజియంను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తారని తెలిపారు. అదే విధంగా జనవరి 7న నగరంలో జరుగు సామాజిక సాధికార బస్సు యాత్రను జయప్రదం చేయవలసిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా మాట్లాడుతూ.. నగరంలో శ్మశాన వాటికలను పూర్తిస్థాయిలో ఆధునికీకరించడంతో పాటు అవసరమైన వసతులను కల్పించేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని తెలిపారు. బందర్ రోడ్డులోని ఖబరిస్తాన్ ను ఇప్పటికే రూ. 40 లక్షల నిధులతో అభివృద్ధి పరుచుకున్నట్లు గుర్తుచేశారు. వాంబేకాలనీ ఖబరిస్తాన్ అభివృద్ధికి సంబంధించి ఈ ప్రాంత మత పెద్దలతో సంప్రదింపులు జరిపి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి రెండో వారంలో జరుగు పెద్దల పండుగ నాటికి పనులు పూర్తయ్యేలా.. నిరంతర పర్యవేక్షణలో యుద్ధప్రాతిపదికన పనులు చేపడతామని చెప్పారు. ముస్లిం సోదరసోదరీమణుల అవసరాలన్నింటినీ ఈ ప్రభుత్వం నెరవేర్చిందని.. దేశంలోనే మైనార్టీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్ వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని తెలియజేశారు.

నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్క డివిజన్లోనూ శానిటరీ ఇన్స్ పెక్టర్ కార్యాలయం ఉండేలా కౌన్సిల్లో తీర్మాణం చేసి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యాలయాల ద్వారా సేవలను మరింత విస్తృతం చేసేందుకు అవకాశం ఏర్పడటంతో పాటు సామాగ్రిని భద్రపరచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి ప్రజావసరాలకు ఉపయోగపడాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. సెంట్రల్ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి నియోజకవర్గ ప్రజల సహాయసహకారాలు ఎల్లవేళలా ఉండాలని కోరారు. అనంతరం మత గురువులు ప్రజాప్రతినిధులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, డీఈ గురునాథం, ఏఈ మౌసమి, వైసీపీ కార్పొరేటర్లు అలంపూర్ విజయలక్ష్మి, యరగొర్ల తిరుపతమ్మ, నాయకులు హఫీజుల్లా, ఉమ్మడి వెంకట్రావు, అఫ్రోజ్, అలంపూర్ విజయ్, యరగొర్ల శ్రీరాములు, ఇసరపు రాజా రమేష్, నాళం బాబు, అమిత్, ఉమర్ పఠాన్ ఖాన్, జిలానీ, మత గురువులు, 17 మసీదుల మత పెద్దలు, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *