Breaking News

రెగ్యులర్‌ చేయండి…కనీస వేతనం ఇవ్వండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఏపీ ఎయిడెడ్‌ కాలేజిస్‌ పార్ట్‌ టైమ్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. గురువారం ధర్నా చౌక్‌లో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఏపీ ఎయిడెడ్‌ కాలేజిస్‌ పార్ట్‌ టైమ్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు అరిగ జోషీరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎయిడెడ్‌ కళాశాలల్లో పనిచేస్తున్న పార్ట్‌ టైమ్‌ అధ్యాపకులను, అధ్యాపకేతర సిబ్బందిని ప్రభుత్వం తక్షణమే రెగ్యులర్‌ చేయాలని లేదా కనీస వేతనమైనా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జీవో నంబరు 328 ప్రకారం పార్ట్‌ టైమ్‌ లెక్చరర్లుగా పనిచేస్తున్నామని తెలిపారు. అయితే 2005లో గత ప్రభుత్వం విడుదల చేసిన జీవో 35 వల్ల ఎయిడెడ్‌ పోస్టులు నిలిపివేయడం జరిగిందన్నారు. ఆ సమయంలో యాజమాన్యం తమను పార్ట్‌ టైమ్‌ అధ్యాపకులుగా నియమించుకోవడంతో రెగ్యులర్‌ అధ్యాపకులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. తమను రెగ్యులర్‌ చేయాలంటూ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలతో పాటు 2018లో ప్రజాసంకల్ప యాత్రలో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించామన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పలుమార్లు అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షరాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో సీఎంను కలవడం జరిగిందన్నారు. స్పందించిన సీఎం జగన్‌ 10 సం.లు సర్వీసు ఉన్న వారిని డిగ్రీ కళాశాలల్లో, 5సం.లు ఉన్నవారిని జూనియర్‌ కళాశాలల్లో కనీస వేతనం అమలు చేయాలని తన వ్యక్తిగత కార్యదర్శి దనుంజయరెడ్డిని ఆదేశించినట్లు తెలిపారు. కానీ సీఎం ఆదేశాలు ఇప్పటివరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా సీఎం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ ధర్నాలో అసోసియేషన్‌ సభ్యులు బి శ్రీనివాసులు, రాము, బి.రాజన్న, సిహెచ్‌ వెంకట మురళీకృష్ణ, ఎం.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *