Breaking News

నగరంలో 10వ సైన్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఫెస్టివల్‌-2023

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని ‘సాయి అరుణ హైస్కూల్‌’నందు డిశంబర్‌ 28, 29, 30 తేదీలనందు 10వ సైన్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఫెస్టివల్‌-2023 జరుగుతున్నది. గురువారం పశ్చిమనియోజకవర్గం, చిట్టినగర్‌లోని ‘సాయి అరుణ హైస్కూల్‌’లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి పి.విజయబాబు, చైర్మన్‌, రాష్ట్ర అధికార భాషా సంఘం ముఖ్యఅతిధిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగులో భువనవిజయం, రామాయణానికి సంబంధించిన వర్కింగ్‌ మోడల్స్‌ను చిన్నారులు వివరించిన తీరును చూసి కొనియాడారు. మరో ముఖ్యఅతిథిగా నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి పలు విద్యార్థిని, విద్యార్థుల సైన్స్‌ వర్కింగ్‌ మోడల్స్‌ ముఖ్యముగా పోలవరపు ప్రాజెక్టు వర్కింగ్‌ మోడల్‌కు అబ్బురపడి, అబ్దుల్‌కలాం భారతదేశం యువత ఎక్కువగా ఉన్నా దేశం అని ఈ దేశాన్ని మీలాంటి యువత చేతిలో పెట్టారన్నారు. కాబట్టి మీరు మరో అబ్దుల్‌ కలాం, సి.వి.రామన్‌ అంతటి వారు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి 47వ డివిజన్‌ కార్పొరేటర్‌ గోదావరి గంగ, 51వ డివిజన్‌ కార్పొరేటర్‌ మరుపిళ్ళ రాజేష్‌, న్యాయ నిర్ణేతలు యిప్పిల వెంకటరెడ్డి, పాఠశాల కరస్పాండెంట్‌ గుజ్జారి అప్పారావు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు టి.దుర్గారావు, వి.రామకృష్ణ, పి.దేవరాజ్‌కుమార్‌, వి.శేషగిరి, విద్యుల్లత, దమయంతి, శ్రీదేవి, హేమలత తదితర ప్రముఖులు, విద్యార్దినీ, విద్యార్దులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *