Breaking News

ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం 25 లక్షలకు పెంపు

-పేదలు ఆర్థికంగా ఎదుగుదలకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు అండగా ఉండాలి-మంత్రి జోగి

పెడన, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుపేదలు ఆర్థికంగా ఎదగడానికి, పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న మనసున్న ముఖ్యమంత్రి గౌ.శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ లబ్ధిదారులకు సూచించారు. వైఎస్సార్ పింఛన్ కానుక పథకం కింద ప్రభుత్వం 2024 జనవరి 1 నుండి పింఛన్లు నెలకు 3 వేల రూపాయలకు పెంచిన సందర్భంగా శుక్రవారం పెడన మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని పెడన పట్టణ పరిధిలోని లబ్ధిదారులకు, కొత్తగా పింఛన్ మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలతో పాటు పెంపు చేసిన 3 వేల పింఛను డబ్బులు, సీఎం లేఖ అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెడన పట్టణ పరిధిలో కొత్తగా పింఛన్ మంజూరైన 43 మందితో కలిపి మొత్తం 4576 మంది లబ్ధిదారులకు నెలకు 3 వేల చొప్పున రు.1,37,60,000/-అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పెడన పట్టణ పరిధిలో 2250 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించే కార్యక్రమం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. చేనేత కార్మికులకు పింఛన్లతో పాటు ఒక్కో కుటుంబానికి 5 విడతల మగ్గం డబ్బులు రు. 1.20 లక్షలు అందించామన్నారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలతో పాటు అవ్వా తాతలకు పింఛన్ల పండుగ వచ్చిందన్నారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు జనవరి 1నుండి 3 వేలకు పెంపు చేసి అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో పింఛన్ల కోసం పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉండేవని, జగన్ ముఖ్యమంత్రి కాగానే వాలంటీర్లు ప్రతి నెల 1వ తేదీనే నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తెల్లవారకముందే తలుపు తట్టి పింఛన్లు మీ చేతుల్లో పెడుతున్న విషయం మరచిపోరాదని అన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మంత్రి వివరిస్తూ పేదలు చదువుకు దూరం కాకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీ పిల్లలను చదివిస్తూ తల్లుల ఖాతాలో అమ్మఒడి డబ్బులు జమ చేస్తున్నారని అన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం తో పాటు హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రం నిర్మించి ప్రభుత్వ సేవలు గ్రామంలోని అందుబాటులోకి తెచ్చారన్నారు. అవ్వ తాతలు ఆరోగ్యంగా ఉండాలని ఇంటి వద్దనే ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం 25 లక్షలకు పెంపు చేయడంతో పాటు అనారోగ్యంతో మంచం మీద ఉన్న రోగులకు మందులు పోస్ట్ ద్వారా కూడా పంపుతున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెడన మున్సిపల్ చైర్ పర్సన్ కటకం నాగకుమారి, వైస్ చైర్ పర్సన్ లు ఎండి ఖాజా, బైలపాటి జ్యోతి, సీనియర్ కౌన్సిలర్ కటకం ప్రసాద్, ఇన్చార్జ్ కమిషనర్ ఏసుబాబు, పెడన తాసిల్దారు మధుసూదనరావు, స్థానిక నాయకులు, వివిధ వార్డుల కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *