Breaking News

రాష్ట్రస్థాయి దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో రాష్ట్రస్థాయి దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం బిడిఎఫ్‌ పార్టీ వ్యవస్థాపకులు కంబాల తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. స్థానిక స్వాతంత్ర సమరయోధులు భవనములో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సహకారంతో రాజకీయ సోపానం రాజకీయ ప్రస్థానం స్థాపనకై దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు జరిగిందిని అన్నారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ‘‘భారత్‌ దివ్యాంగ్‌ పార్టీ’’ (బిడిఎఫ్‌)ని బలోపేతం చేస్తామని, రానున్న ఎన్నికల్లో 26 జిల్లాల్లో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్‌ స్థానాలకు మా దివ్యాంగులు పోటీ చేస్తారని అన్నారు. తదనంతరం కార్యవర్గ సభ్యులు కొణతం చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని దివ్యాంగులు పంచాయతీ నుండి పార్లమెంట్‌ వరకు ఎన్నికలలో ప్రాతినిధ్యం వహిస్తారని, దానికి ప్రజలు సహకరించాలని, దివ్యాంగులును గుర్తించాలని ఆయన కోరారు. దివ్యాంగుల చట్టసభలలో ప్రతి నియోజకవర్గంలో దివ్యాంగుల ఉనికిని కాపాడుకొనేందుకే మా పార్టీ కృషి చేస్తుందని అన్నారు. మా దివ్యంగుల పరిస్థితి ఎంతో దయానీయంగా ఉందని ఆయన అన్నారు. చట్టసభలలో మాకు ప్రాముఖ్యత దివ్యాంగులకు రిజర్వేషన్స్‌ ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు షేక్‌ చాన్‌బీ, వసంతకుమార్‌, రామరాజు, చినమల్లప్ప, దొణస్వామి, లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు, వెంకట్‌, అమ్మ రెడ్డి రజిని తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *