Breaking News

కోడి పందాలు నిర్వహించినా.. పాల్గొన్నా.. చట్టరీత్యా నేరమే..

– చ‌ట్ట ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డితే క్రిమిన‌ల్ చ‌ర్య‌లు
– ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని… ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ చర్యలు త‌ప్ప‌వ‌ని ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు హెచ్చ‌రించారు. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా జిల్లాలో కోడి పందాలు జ‌ర‌క్కుండా తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్‌.డిల్లీరావు సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. కోడిపందాలు నిర్వ‌హించ‌డం-పాల్గొన‌టం చ‌ట్ట‌రీత్యా నేర‌మంటూ రూపొందించిన పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు.
ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్-1974 సెక్ష‌న్‌-10, జంతుహింస నివారణ చట్టం-1960 సెక్ష‌న్ 34 ప్రకారం కోడి పందాలను నిషేధించ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ చ‌ట్టాల‌ను ఉల్లంఘిస్తే క్రిమిన‌ల్ చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని స్ప‌ష్టం చేశారు. కోడి పందాలను నివారించేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. చ‌ట్టంలోని అంశాల‌పై ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యే రీతిలో ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని సూచించారు. పోలీస్, రెవెన్యూ, పశుసంవర్థక శాఖ అధికారులు సమన్వయంతో బృందాలుగా ఏర్ప‌డి క్షేత్రస్థాయిలో పర్యటించి ఎక్క‌డా కోడి పందాలు జ‌ర‌క్కుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స‌మావేశంలో డీఆర్‌వో ఎస్‌వీ నాగేశ్వ‌ర‌రావు, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డా. కె.విద్యాసాగ‌ర్‌, ఏడీ డా. విక్ర‌మ్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *