Breaking News

తొమ్మిది శాఖల అధికారులతో సమీక్ష…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ట్రెజరీ స్ట్రాంగ్ రూం లో ఉన్న ఆర్టికల్స్ ఉపసంహరించు కోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్, స్ట్రాంగ్ రూం పర్యవేక్షణ జిల్లా నోడల్ అధికారి ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక జేసీ ఛాంబర్ లో సమన్వయ తొమ్మిది శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, దీర్ఘ కాలికంగా జిల్లా పరిధిలోని 15 శాఖలకు చెందిన 79 ఆర్టికల్స్ స్ట్రాంగ్ రూం లో ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా శాఖలకు వివరాలు తెలియ చెయ్యడం జరిగిందన్నారు. ఇరిగేషన్ 28, ఎసిబి 13 , పోలీస్ 13 , పంచాయతీ రాజ్ 6 , రెవెన్యూ 5 , ప్రిజన్స్ 2, గిరిజన సంక్షేమ 2 , సీ ఐ డి 3 , ఆర్ అండ్ బి, సమాచార శాఖ , విజిలెన్స్ , దేవాదాయ , ట్రెజరీ, జుడిషియల్ శాఖలకు చెందిన ఒకొక్కటి ఆర్టికల్స్ స్ట్రాంగ్ రూం లో ఉన్నాయని తెలిపారు. నాలుగు అంశాల వారీగా ఏ ఏ ఆర్టికల్స్, ఎంతకాలం నుంచి, స్టాంప్స్, చెక్ బుక్స్ వారీగా సమగ్ర నివేదికను సిద్దం చేశామన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు , జిల్లా ట్రెజరీ అధికారి ఎన్. సత్యనారాయణ , సహాయ ట్రెజరీ అధికారి కె. వినోద్, అదనపు ఎస్పీ ఎల్. చెంచు రెడ్డి , జిల్లా రిజిస్ట్రార్ కే. ఆనంద రావు , ఎండోమెంట్ ఎ సి – వి. సోమశేఖర తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *