Breaking News

పెద్ద మొత్తంలో జరిగిన ప్రధాన నగదు లావాదేవీల జాబితాను అన్ని బ్యాంకులు అందచేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
లోక్ సభ ఎన్నికలు మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సాధారణ ఎన్నికలు -2024 నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా పరిధిలో గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు పెద్ద మొత్తంలో జరిగిన ప్రధాన నగదు లావాదేవీల జాబితాను అన్ని బ్యాంకులు అందచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు.

సోమవారం ఉదయం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్ల తో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ , 2024 లోక్ సభకు మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగే సాధారణ ఎన్నికల నిర్వహణ దృష్ట్యా, సున్నితమైన నియోజకవర్గాలలో (ESCలు) మరియు సున్నితమైన పాకెట్స్‌లో (ESPలు) ఖర్చులను గుర్తించడానికి బ్యాంకర్స్ నగదు లావాదేవీల అంశం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ విషయంపై సూచనలు చేసినప్పటికీ బ్యాంకులు ఇప్పటివరకు వివరాలను సమర్పించలేదని, తక్షణం నివేదిక అందచేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని బ్యాంకుల కంట్రోలర్లు/కోఆర్డినేటర్ల ఈ విషయంపై మండలాలు నియోజక వర్గాల వారిగా నివేదిక సిద్ధం చేయాలని కోరారు.

1. ఒక రోజులో ఎక్కువ మొత్తం లో జరిగిన లావాదేవీల వివరాలు, ఒక నెలలో అత్యధిక మొత్తం లో జరిగిన లావాదేవీల వివరాలు, ఒకే ఖాతా నుండి బహుళ లావాదేవీలు , ఎన్నికల ప్రకటనకు ముందు ఆరు నెలల్లో కరెన్సీకి డిమాండ్‌ కంటే అధికంగా నిర్వహించిన ఖాతా దారుల వివరాలు, అసాధారణమైన అధిక సంఖ్యలో ఆన్‌లైన్/డిజిటల్ లావాదేవీలు వంటి అంశాలపై నివేదిక అందచేయాలని కోరారు. ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్‌లుగా పనిచేయడానికి జిల్లాలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు అందచెయ్యలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, ఎల్ డి ఎం డి. దుర్గా ప్రసాద్ , కన్వీనర్ వై సురేష్ , ఎస్ బి ఐ , బి వో బి , ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, అన్ని జాతీయ బ్యాంకుల జిల్లా హెడ్‌లు మరియు ప్రైవేట్ బ్యాంక్ హెడ్‌లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *